HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >I Take The Comparisons With Trivikram As A Compliment

Tollywood : త్రివిక్రమ్ గారు లా రాశానంటే గౌరవంగా భావిస్తా!

టాలీవుడ్ రీసెంట్ సూపర్ హిట్ వరుడు కావలెను. నాగశౌర్య, రీతు వర్మ జంటగా నటించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై పి.డి.వి ప్రసాద్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా రూపొందించారు.

  • Author : Balu J Date : 03-11-2021 - 2:12 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
టాలీవుడ్ రీసెంట్ సూపర్ హిట్ వరుడు కావలెను. నాగశౌర్య, రీతు వర్మ జంటగా నటించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై పి.డి.వి ప్రసాద్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా రూపొందించారు. లక్ష్మీ సౌజన్య దర్శకురాలు. ‘వరుడు కావలెను’ చిత్రంతో మాటల రచయితగా పరిచయం అయ్యారు గణేష్ రావూరి. ఈ సినిమా విజయంలో డైలాగ్స్ కు మంచి క్రెడిట్ దక్కింది. ‘వరుడు కావలెను’ సినిమా ఘన విజయం సాధించిన నేపథ్యంలో మాటల రచయిత గణేష్ రావూరి సినిమాకు పనిచేసిన తన అనుభవాలను, కెరీర్ విశేషాలను మీడియాతో పంచుకున్నారు.
డైలాగ్ రైటర్ గణేష్ రావూరి మాట్లాడుతూ..గతంలో సోలో బ్రతుకే సో బెటర్ తో పాటు ఒకట్రెండు చిత్రాలకు ఒక వెర్షన్ డైలాగ్స్ రాశాను. పూర్తిగా ఓ సినిమాకు వర్క్ చేసింది మాత్రం ‘వరుడు కావలెను’ చిత్రానికే. ఈ సినిమాకు నిర్మాత నాగ‌వంశీ గారు పిలిచి నువ్వు బాగా రాస్తావని విన్నాను, మా కొత్త సినిమాకు మాటలు ఒక వెర్షన్ రాసి ఇవ్వు, బాగుంటే చేద్దామని చెప్పారు. నేను పోర్షన్ లా డైలాగ్స్ రాస్తూ మొత్తం కథకు మాటలు రాశాను. అవి చూశాక బాగుందని ఓకే చేశారు. అలా ‘వరుడు కావలెను’ టీమ్ లోకి వచ్చాను. వరుడు కావలెను’ సినిమాకు వస్తున్న స్పందన, మాటలు బాగున్నాయంటూ వచ్చే ప్రశంసలు సంతోషాన్ని ఇస్తున్నాయి. ఇండస్ట్రీలో పెద్ద దర్శకుల దగ్గర నుంచి కూడా ఫోన్స్ వచ్చాయి. నేను రాసిన మాటలు విని నిర్మాత చినబాబు గారు నవ్వడం నాకు అతి పెద్ద ప్రశంస అనుకుంటాను.
‘వరుడు కావలెను’ కథలో కామెడీ, ఎమోషన్స్ కలిసి ఉంటాయి. ఈ రెండింటికీ మాటలు బాగా కుదిరాయి. హీరో హీరోయిన్ల పాత్రలకు ఓ పరిధి ఉంటుంది. ఆ పరిధి మేరకు మాటలు రాశాను. హీరో హీరోయిన్ల పాత్రలు తమ మనసులో మాటను ఒకరికొకరు చెప్పకుండా మాటలు, కథనాన్ని ఒక బిగితో చివరి వరకు తీసుకెళ్లాం. హీరోతో హీరోయిన్ రెండు సార్లు ప్రేమలో పడటం నాకు బాగా నచ్చిన అంశం. రచయితగా త్రివిక్రమ్ గారి శైలిని అనుసరించలేదు. ఆయనలా రాశానని ఎవరైనా చెబితే దాన్ని పెద్ద గౌరవంగా భావిస్తా. త్రివిక్రమ్ గారు చిన్న పదాలతో మాటలు రాస్తారు. నేను మాత్రం ఆ పాత్ర ఏం మాట్లాడితే బాగుంటుందో అలా మాటలు రాశాను.  దర్శకురాలు సౌజన్య, నిర్మాత నాగ‌వంశీ గారు కూడా అలాగే రాయమని ప్రోత్సహించారు.
సినిమా సక్సెస్ మీట్ లో దర్శకురాలు సౌజన్య గారు సినిమా విజయంలో డైలాగ్స్  కు మంచి క్రెడిట్ ఇచ్చారు. అది ఆమె గొప్పదనం అనుకుంటాను. ఆమే కాదు సినిమా టీమ్ మొత్తం నేను కొత్త రైటర్ ను అయినా నన్ను వాళ్లలో కలుపుకున్నారు. స్నేహితుడిలా ప్రోత్సహించారు. ఫస్టా ఫ్ లో వెన్నెల కిషోర్, హిమజ, శ్రావణి, ప్రవీణ్ క్యారెక్టర్ లు చేసిన కామెడీ కథలో నుంచి పుట్టిందే. వాటికి సెపరేట్ గా కామెడీ ట్రాక్ రాయలేదు. అలాగే సెకండాఫ్ లో పమ్మి సాయి, సప్తగిరి పాత్రలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. హీరో హీరోయిన్లు తమ లవ్ చెప్పుకోకుండా ఉండేందుకు పెళ్లి నేపథ్యంతో ఈ కొత్త క్యారెక్టర్ లు ఇంట్రడ్యూస్ చేశాం. వాటికి థియేటర్ లో రెస్పాన్స్ బాగుంది. నాకు కమర్షియల్ మూవీస్ కు, మాస్ చిత్రాలకు మాటలు రాయాలని ఉంది. త్వరలో అలాంటి అ‌వకాశాలు వస్తాయని ఆశిస్తున్నా.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • telugu movie
  • tollywood
  • varudu kavalenu
  • writer

Related News

Ram Charan’s ‘Peddi’ enters the ₹300 crore club.

Peddi Collections: రూ.300 కోట్ల క్లబ్‌లోకి రామ్ చరణ్ ‘పెద్ది’

Ram Charan మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా, విడుదలైన కేవలం 5 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 315 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ అధికారికంగా పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ నెల 4న ప్ర

    Latest News

    • AI Data Center : మెటా, రిలయన్స్ చారిత్రాత్మక ఒప్పందం..గుజరాత్‌లో ‘ఏఐ డేటా సెంటర్’

    • Evening Puja : సాయంత్రం దేవుడిని పూజించేటప్పుడు ఈ మంత్రాలు పఠించండి.. అదృష్టం కలిసి వస్తుంది..!!

    • Thalliki Vandanam: తల్లికి వందనం డబ్బులు పడేది ఆరోజే!

    • Pemmasani Chandra Sekhar: ఏపీకి కేంద్రం భారీగా నిధులు మంజూరు: కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

    • Amit Shah: తెలంగాణలో పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd