Hrithik Roshan NTR War 2 : రణరంగంలో స్టార్స్ ఫైట్.. వార్ 2 యాక్షన్ సీక్వెన్స్ తోనే స్టార్ట్ చేస్తున్నారట..!
Hrithik Roshan NTR War 2 2019లో వచ్చిన వార్ సినిమాకు సీక్వెల్ గా వార్ 2 ని స్టార్ట్ చేయనున్నారు. వార్ మూవీని సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేయగా వార్ 2 ని అయాన్ ముఖర్జీ చేతుల్లో
- By Ramesh Published Date - 06:13 PM, Tue - 6 February 24

Hrithik Roshan NTR War 2 2019లో వచ్చిన వార్ సినిమాకు సీక్వెల్ గా వార్ 2 ని స్టార్ట్ చేయనున్నారు. వార్ మూవీని సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేయగా వార్ 2 ని అయాన్ ముఖర్జీ చేతుల్లో పెడుతున్నారు. యశ్ రాజ్ ఫిలింస్ ఈ సినిమాను ఎంతో ప్రతిస్ఠాత్మకంగా తెరకెక్కించనుంది. హృతిక్ రోషన్ తో పాటుగా ఈ మూవీలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. హృతిక్, తారక్ ఇద్దరు నువ్వా నేనా అనేలా ఢీ కొట్టబోతున్నారు.
ఈ సినిమాకు సంబందించిన షూటింగ్ అప్డేట్స్ బయటకు వచ్చాయి. వార్ 2 సినిమాను ఫిబ్రవరి ఎండింగ్ లో సెట్స్ మీదకు వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. వార్ 2 కోసం మొదటి షెడ్యూల్ నే ఒక భారీ ఫైట్ తో మొదలు పెడుతున్నారత. హృతిక్ రోషన్, ఎన్.టి.ఆర్ ఇద్దరు ఈ ఫైట్ లో పాల్గొంటారని తెలుస్తుంది. ఎన్.టి.ఆర్ చేస్తున్న మొదటి బాలీవుడ్ సినిమాగా వార్ 2 మీద భారీ క్రేజ్ ఏర్పడింది.
వార్ 2 సినిమా విషయంలో మేకర్స్ ప్లాన్ ఓ రేంజ్ లో ఉండబోతుందని తెలుస్తుంది. సినిమాలో హృతిక్ హీరోగా నటిస్తుండగా ఎన్.టి.ఆర్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తారని తెలుస్తుంది. వార్ 2 కోసం ఎన్.టి.ఆర్ లుక్ స్టైల్ అంతా కొత్తగా ఉంటాయని అంటున్నారు. బ్రహ్మాస్త్ర సినిమాతో సత్తా చాటిన డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఈ సినిమాను కూడా భారీ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు.
Also Read : Eagle : అవకాశం ఉన్నా వాడుకోలేదు.. నార్మల్ రేట్లకే ఈగల్ టికెట్లు.. రీజన్ అదే..!