Priya Bhavani Shankar : నాకో బోయ్ ఫ్రెండ్ ఉన్నాడు.. అతనితో డేటింగ్ లో ఉన్నా..!
సినిమాలో సిద్ధార్థ్ ఫ్రెండ్ రోల్ లో ప్రియా కనిపించింది. ఐతే ఆ సినిమా ఫ్లాప్ అవ్వడం వల్ల ఆమె మీద ట్రోల్స్ వచ్చాయి. ఇక మరోపక్క ఆమె ఎవరికి బర్త్ డే విష్ చేసినా
- Author : Ramesh
Date : 07-08-2024 - 10:07 IST
Published By : Hashtagu Telugu Desk
Priya Bhavani Shankar కోలీవుడ్ లో అటు సోలో సినిమాలు చేస్తూ ఇటు స్టార్ సినిమాల్లో ఇంపార్టెంట్ రోల్స్ కూడా చేస్తూ ఆడియన్స్ ను మెప్పిస్తూ వస్తుంది ప్రియా భవాని శంకర్. తెలుగులో అసలైతే మంచు మనోజ్ సినిమాతో ఎంట్రీ ఇవ్వాల్సి ఉన్నా అది కుదరలేదు. సంతోష్ శోభన్ (Santosh Sobhan) తో కళ్యాణం కమనీయం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ప్రియా భవాని శంకర్ ఆ తర్వాత నాగ చైతన్య విక్రం కుమార్ చేసిన ధూత వెబ్ సీరీస్ లో కూడా నటించింది.
సినిమాలు సీరీస్ లు అనే తేడా లేకుండా మెప్పిస్తున్న ప్రియా భవాని శంకర్ రీసెంట్ గా వచ్చిన ఇండియన్ 2 (Indian 2) సినిమాలో కూడా నటించింది. సినిమాలో సిద్ధార్థ్ ఫ్రెండ్ రోల్ లో ప్రియా కనిపించింది. ఐతే ఆ సినిమా ఫ్లాప్ అవ్వడం వల్ల ఆమె మీద ట్రోల్స్ వచ్చాయి. ఇక మరోపక్క ఆమె ఎవరికి బర్త్ డే విష్ చేసినా అతనితో లింక్ పెట్టి మరీ ట్రోల్ చేస్తున్నారు.
Also Read : Ram : రామ్ కమిట్మెంట్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!
ఐతే దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతో తన బోయ్ ఫ్రెండ్ పేరు బయట పెట్టింది ప్రియా భవాని శంకర్. తనజు రాజు అనే బోయ్ ఫ్రెండ్ ఉన్నాడని అతనితో తాను డేటింగ్ లో ఉన్నానని చెప్పింది ప్రియా. అంతేకాదు సినిమాల్లోకి రాకముందు నుంచి అతనితో కలిసి ఉంటున్నా అని. తనపై వచ్చిన ఇలాంటి వార్తలను చూసి మేం నవ్వుకుంటామని అన్నది ప్రియా భవాని శంకర్.
ఇక తన పెళ్లి గురించి కూడా త్వరలోనే ఒక మంచి వార్త చెబుతానని అంటుంది ప్రియా భవాని శంకర్. ఐతే కోలీవుడ్ లో ఇప్పటికీ వరుస ఆఫర్లు అందుకుంటున్న ప్రియా పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలు చేస్తుందా లేదా అన్న డౌట్ ఆడియన్స్ లో మొదలైంది.