Aditi Rao Hydari : పెళ్లి తర్వాత హీరోయిన్ అదితి పెట్టిన ఫస్ట్ పోస్ట్
Aditi Rao Hydari : 'నువ్వే నా సూర్యుడు. నువ్వే నా చంద్రుడు. నువ్వే నా తారాలోకం. మిసెస్ అండ్ మిస్టర్ సిద్ధు' అని ఆమె రాసుకొచ్చింది.
- By Sudheer Published Date - 03:57 PM, Mon - 16 September 24

Heroine Aditi’s First Post after Marriage : ఎట్టకేలకు హీరో సిద్దార్థ్ – హీరోయిన్ అదితిరావు హైదరీ పెళ్లి (Aditi Rao Hydari – Siddharth Wedding) చేసుకొని ఒకటయ్యారు. గత కొద్దీ రోజులుగా పీకల్లోతు ప్రేమలో ఉన్న వీరు..పెళ్లి చేసుకుంటారో లేదో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈరోజు ఆసక్తికి తెరదించారు. తెలంగాణలోని వనపర్తి లో 400 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీరంగాపూర్ లోని శ్రీ రంగనాథ స్వామి దేవాలయం (Sri Ranganatha Swamy Temple) లో వివాహం చేసుకున్నారు. ఈ వివాహ వేడుకకు అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు.
దక్షిణాది సంప్రదాయం ప్రకారం వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. పెళ్లి అనంతరం సోషల్ మీడియాలో హీరోయిన్ అదితిరావు హైదరీ (Aditi Rao Hydari) తొలి పోస్ట్ చేశారు. ‘నువ్వే నా సూర్యుడు. నువ్వే నా చంద్రుడు. నువ్వే నా తారాలోకం. మిసెస్ అండ్ మిస్టర్ సిద్ధు’ అని ఆమె రాసుకొచ్చింది. ఇక పెళ్లి లో అదితి రావు హైదరి గోల్డెన్ జెరీ వర్క్ తో డిజైన్ చేసిన అద్భుతమైన టిష్యూ ఆర్గాంజా లెహంగా ధరించి, దానికి సరిపోయే చేతితో చేసిన ఎంబ్రాయిడరీ బార్డర్ కలిగిన గోల్డెన్ బ్లౌజ్ ను ధరించింది .ఇక వరుడు సిద్దార్థ్ (Siddarth) సాంప్రదాయ వేస్టి బాటమ్ తో స్టైల్ చేసిన మైక్రో ఎంబ్రాయిడరీ తో కూడిన కుర్తా ధరించారు. ఇక పెళ్లి బట్టల్లో వీరిద్దరూ చాలా అందంగా కనిపించారని చెప్పవచ్చు.
Read Also : Shanmukh Jaswanth : హీరోగా మారుతున్న షన్ను.. వెండితెరపై మెప్పిస్తాడా..?