అఖిల్ అక్కినేని ఈసారైనా ‘హిట్’ కొడతాడా..!
నటన అనేది వారసత్వంలో ఉంటుందా..? రక్తంలో ఉంటుందా..? అంటే.. జస్ట్ అవన్నీ ఎంట్రీకి మాత్రమే పనికొస్తాయి. ఇక్కడ టన్నులకొద్దీ టాలెంట్ ఉంటేనే రాణించడానికి స్కోప్ ఉంటుంది.
- By Balu J Published Date - 03:14 PM, Mon - 27 September 21

నటన అనేది వారసత్వంలో ఉంటుందా..? రక్తంలో ఉంటుందా..? అంటే.. జస్ట్ అవన్నీ ఎంట్రీకి మాత్రమే పనికొస్తాయి. ఇక్కడ టన్నులకొద్దీ టాలెంట్ ఉంటేనే రాణించడానికి స్కోప్ ఉంటుంది. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటామంటే ఏమాత్రం కుదరదు. ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారా…? అదేనండీ కింగ్ నాగార్జున కొడుకు అఖిల్ అక్కినేని గురించి.. అందంలో అక్కినేని అంతటోడు అనిపించుకున్నప్పటికీ.. ఇప్పటికీ సరైన హిట్ లేక రేసులో వెనుకబడిపోయాడని చెప్పక తప్పదు.
ఒకవైపు తన సోదరుడైన నాగచైతన్య వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంటే.. అఖిల్ మాత్రం సినిమాల ఎంపికలో తప్పడుగులు వేస్తూ హిట్ కోసం కళ్ల కాయలు చూసేలా ఎదురుచూస్తున్నాడు. ఏమాయ చేసావే, మజిలీ, మనం, లవ్ స్టోరీ సినిమాలతో ఇప్పటికే తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు నాగచైతన్య. అఖిల్ మాత్రం ముచ్చటగా మూడు సినిమాలు చేసినా కనీసం ఓకే కూడా అనిపించుకోలేకపోయాడు. అఖిల్, హలో, మజ్ను.. లాంటి మూవీస్ చేసి నిరాశే మిగిల్చాడు. అందానికి అందం ఉన్నా.. స్టోరీ సెలక్షన్స్ లో పట్టులేకపోవడం.. యాక్టింగ్ లోనూ సహజత్వం చూపకపోవడం మైనస్ గా నిలుస్తాయని టాలీవుడ్ టాక్. అయితే చైతన్య-సమంత వ్యవహరం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ మారగా, మరోవైపు అఖిల్ వరుసగా ప్లాపుల్లో కొట్టామిట్టాడుతుండటం నాగార్జునకు ఏమాత్రం మింగుడు పడటం లేదని ఫిల్మ్ నగర్ వర్గాలు భావిస్తున్నాయి.
ఇక అఖిల్ తన నాలుగో సినిమాపైనే అంచనాలు పెట్టుకున్నాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ ప్రకటించిన రోజు నుంచి ఈ సినిమాపై అక్కినేని అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ టీం విడుదల చేసిన అఖిల్ అక్కినేని ఫస్ట్ లుక్, అలానే గోపీ సుందర్ సంగీత సారధ్యంలో హ్యాపెనింగ్ స్టార్ సింగర్ సిద్ శ్రీరామ్ పాడిన మనసా మనసా పాట లాంటి సాంగ్స్ పేరు తెచ్చుకోవడం కొత్త ఉత్సాహన్ని తెచ్చింది. ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు, ప్రతిష్టాత్మకమైన గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కుతుండటంతో ప్లస్ గా భావించవచ్చు. దసరా కానుకగా రిలీజ్ కానుకగా ఈ సినిమాతోనే అఖిల్ హిట్ కొడతాడా.. అని అక్కినేని అభిమానులు వెయ్యికళ్లతో ఆశగా ఎదురుచూస్తున్నారు.
Related News

Rashmika : సమంత ప్లేస్ లో రష్మిక.. గోల్డెన్ ఛాన్స్..!
Rashmika స్టార్ హీరోయిన్ సమంత హెల్త్ ఇష్యూస్ వల్ల తన దాకా వచ్చిన ఛాన్స్ లను కూడా మిస్ అవుతూ వస్తుంది. రీసెంట్ గా విజయ్