Dhanush Body Shaming: ఆటో డ్రైవర్ లా ఉన్నాడు, వీడు హీరో ఏంటీ? ధనుష్ పై బాడీ షేమింగ్
హీరో రజనీకాంత్ అల్లుడిగా పేరున్నప్పటికీ ధనుష్ (Dhanush) కూడా కెరీర్ ఆరంభంలో ఎన్నో అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.
- Author : Balu J
Date : 07-03-2023 - 4:30 IST
Published By : Hashtagu Telugu Desk
తమిళ్ (Tamil) సూపర్ స్టార్స్ అనగానే అందులో కచ్చితంగా ధనుష్ ఉంటాడు. యాక్టింగ్ నుంచి సింగింగ్ వరకు ఆల్ రౌండర్ అని నిరూపించుకున్నాడు. హీరో రజనీకాంత్ అల్లుడిగా పేరున్నప్పటికీ ధనుష్ (Dhanush) కూడా కెరీర్ ఆరంభంలో ఎన్నో అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సమయంలో తండ్రి మద్దతు ఉన్నప్పటికీ, చాలా అవమానాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒకప్పుడు తన సినిమా సెట్స్‌లో తోటి నటీనటులు, సిబ్బంది ద్వారా బాడీ షేమ్ (Body shaming)కు గురయ్యాడు.
వీడు హీరో ఏంటీ? అనే మాటలు ధనుష్ ను తీవ్రంగా బాధించాయి. ధనుష్ 2003లో కాదల్ కొండెన్ సెట్స్‌లో తన లుక్స్‌ని చూసి తోటి నటులు ఎగతాళి చేశాడని, బక్కగా పీలగా ఉన్నాడని ట్రోల్స్ (Trolls) చేశారని గుర్తు చేసుకున్నాడు. ఆ ట్రోల్స్ తనను తీవ్రంగా ప్రభావితం చేశాయని, గదిలోకి వెళ్లి ఆ బాధతో గట్టిగా అరిచానని చెప్పారు. కెరీర్ ప్రారంభంలో నేనే హీరో అని తెలియగానే సెట్‌లో ఉన్నవారంతా నన్ను చూసి నవ్వుకున్నారు. ‘ఏయ్ ఆటోడ్రైవర్ చూడు, అతనే హీరో’ అని చెప్పారు. నేను చిన్న పిల్లవాడిని, అప్పటికి ప్రశాంతత లేకపోవడంతో నేను నా కారు వద్దకు వెళ్లి గట్టిగా అరిచాను. నన్ను ట్రోల్ చేసి బాడీ షేమ్ చేయని వ్యక్తి కూడా లేడు.” “ఆటో డ్రైవర్ ఎందుకు హీరో కాలేడు?” అని ఆలోచించడం ప్రారంభించానని అతను (Dhanush) చెప్పాడు.
ధనుష్ సోదరుడు సెల్వరాఘవన్ దర్శకత్వం వహించిన కాదల్ కొండేన్‌లో సోనియా అగర్వాల్‌గా నటించారు. అయితే, నటుడు తన లుక్స్ కోసం విమర్శించినప్పటికీ, ఈ చిత్రం అతని కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా మారింది. ఈ సినిమా ధనుష్‌ని నటుడిగా పేరు తెచ్చుకోవడంతోపాటు తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ఆ తర్వాత అనేక హిట్ సినిమాల్లో నటించి తనకంటూ ఓ పేరు తెచ్చుకున్నాడు ధనుష్. ఈ స్టార్ ఇటీవలనే తెలుగులో సార్ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా అదిరిపొయే కలెక్షన్లు సాధించి తాను ఒక (Dhanush) సూపర్ స్టార్ అని చెప్పకనే చెప్పాడు.
Also Read: Poonam Kaur Emotional: నేనూ తెలంగాణ బిడ్డనే.. పూనమ్ కౌర్ ఎమోషనల్!