Poonam Kaur Emotional: నేనూ తెలంగాణ బిడ్డనే.. పూనమ్ కౌర్ ఎమోషనల్!
నేను తెలంగాణలో పుట్టి పెరిగిన అమ్మాయిని. అయితే నా మతం పేరు చెప్పి నన్ను తెలంగాణ నుంచి వేరు చేస్తున్నారు.
- Author : Balu J
Date : 07-03-2023 - 2:22 IST
Published By : Hashtagu Telugu Desk
హీరోయిన్ పూనమ్ కౌర్ (Poonam Kaur) నిత్యం వార్తల్లోకెక్కుతున్నారు. సొసైటీలో జరుగుతున్న పలు విషయాలను ప్రస్తావిస్తూ ట్వీట్ చేస్తుండటంతో ఈ నటి హాట్ టాపిక్ గా మారారు. పలు రాజకీయపరమైన విషయాలపై మాట్లాడుతూ అందరీ ద్రుష్టి ఆకర్షిస్తున్నారు. గతంలో రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్రలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు. అయితే తాజాగా సోమవారం రాజ్‌భవన్‌లో మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో పూనమ్ కౌర్ కూడా పాల్గొన్నారు.
ఆమె మాట్లాడే సందర్భంలో ‘‘నేను తెలంగాణలో పుట్టి పెరిగిన అమ్మాయిని. అయితే నా మతం పేరు చెప్పి నన్ను తెలంగాణ నుంచి వేరు చేస్తున్నారు. నేను పంజాబీ అమ్మాయినని ఎప్పుడూ చెబుతుంటారు. నేను ఇక్కడే పుట్టాను.. పెరిగాను. నా మతం నన్ను నా రాష్ట్రం నుంచి వేరు చేయదు. మీ అందరిలాగానే నేను తెలంగాణ బిడ్డని. నేను పంజాబీ అని చెప్పి వేరు చేస్తున్నారు’’ అని ఎమోషనల్ అయ్యారు. స్టేజ్‌పై కన్నీళ్లు (Poonam Kaur) పెట్టుకున్నారు.
పూనమ్ కౌర్ తెలంగాణపై చేసిన సెన్సేషనల్ వీడియో సోషల్ మీడియా (Social media)లో తెగ వైరల్ అవుతుంది. అయితే ఆమెను ఎవరు దూరం పెడుతున్నారనే విషయంపై మాత్రం ఆమె ఆ వీడియోలో బహిరంగ పరచలేదు. గవర్నర్ ఉండే రాజ్ భవన్‌లో ఓ హీరోయిన్ అంత బహిరంగంగా, ఎమోషనల్‌గా కన్నీళ్లు పెట్టుకుని అలా మాట్లాడటం నిజంగా ఆలోచించదగ్గ పరిణామమే. తెలుగు, తమిళం సహా దక్షిణాది చిత్రాల్లో నటించిన పూనమ్ కౌర్ వివాదాల్లో ఎక్కువగా నిలుస్తున్నారు. ఈ బ్యూటీకి (Poonam Kaur) ఓ టాలీవుడ్ టాప్ హీరోతోనూ లింక్స్ ఉన్నట్ల సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
నేను తెలంగాణలో పుట్టాను.. నేను తెలంగాణ బిడ్డనే
నేను పంజాబీని అని, సిక్కుని అని.. మతం పేరు మీద నన్ను తెలంగాణ నుండి వేరుచేద్దాం అని చూస్తున్నారు – పూనమ్ కౌర్#PoonamKaur #Telangana pic.twitter.com/jExlCJ82vp
— Telugu Scribe (@TeluguScribe) March 6, 2023