HHVM : గుస్ బంప్స్ తెప్పిస్తున్న హరిహర వీరమల్లు టికెట్ ధరలు
HHVM : ఈ సినిమాకు సంబంధించిన టికెట్ ధరలు, ప్రీమియర్ షోల విషయమై ఇప్పుడే టాలీవుడ్‌లో హాట్ టాపిక్ నడుస్తోంది
- By Sudheer Published Date - 03:41 PM, Sat - 19 July 25

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంగా హరిహర వీరమల్లు (Hari Hara Veeramallu) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన టికెట్ ధరలు, ప్రీమియర్ షోల విషయమై ఇప్పుడే టాలీవుడ్‌లో హాట్ టాపిక్ నడుస్తోంది. గత కొంతకాలంగా పెద్ద హీరోల చిత్రాలు ప్రీమియర్ షోలు వేయడం అనేది మానేశారు. బాహుబలి తర్వాత ప్రీమియర్ కు ఫుల్ స్టాప్ పడినప్పటికీ , పుష్ప 2 తో మళ్లీ మొదలుపెట్టారు. కానీ ప్రీమియర్ సందర్బంగా జరిగిన పలు సంఘటనల కారణంగా మరోసారి ప్రీమియర్ షో వేసేందుకు సాహసం చేయలేదు. . ఇప్పుడు ఈ ట్రెండ్‌ను తిరిగి వీరమల్లుతో తీసుకొస్తున్నట్టే కనిపిస్తోంది. ఇది సినిమా మీద ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తోంది.
Big B : బిగ్ బి క్రేజ్ ఏమాత్రం తగ్గడంలేదు అనడానికి ఈ రెమ్యూనరేషన్ చాలు !!
నిర్మాత ఏఎం రత్నం ప్రకటించిన దాని ప్రకారం.. జూలై 23 రాత్రి 9 గంటల తర్వాత ప్రీమియర్ షోలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే దీనికి సంబంధించి అధికారికంగా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల అనుమతులు అవసరం. అవి వచ్చిన వెంటనే ప్రీమియర్ షోలపై అధికారిక ప్రకటన వెలువడనుంది. ఈ షోల టికెట్ ధరలు 600 నుంచి 1000 రూపాయల మధ్య ఉండొచ్చని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇక తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరలు (Hari Hara Veeramallu Ticket Price) కూడా ఇప్పుడు గుస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. తాజాగా ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. మొదటి రెండు వారాలు టికెట్ రేట్లు పెంచాలని నిర్మాతలు ప్రభుత్వాన్ని కోరారు. కాగా ప్రభుత్వం తొలి పది రోజులకే టికెట్ ధరలు పెంచుతూ అవకాశం కల్పించింది. పెరిగిన ధరల మేరకు అప్పర్ క్లాస్..150 రూపాయలు.. అదే విధంగా..మల్టీప్లెక్స్ లో 200 పెంపుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఇక తెలంగాణలో సింగిల్ స్క్రీన్లలో రూ.265గా, మల్టీప్లెక్స్‌లలో రూ.413గా నిర్ణయించినట్లు తెలుస్తుంది. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సైతం ఈ టికెట్ రేట్లకూ మొగ్గుచూపే అవకాశమే ఎక్కువగా ఉంది. చూద్దాం మరి ఏంజరుగుతుందో !!