HHVM : హరిహర వీరమల్లు టాక్..పవన్ యాక్షన్ గూస్ బంప్స్
HHVM : యుద్ధ నాయకుడిగా పవన్ పోరాటాన్ని చూపిస్తూ, కేవలం కోహినూర్ కోసం కాదని, ఒక జాతి గౌరవం కోసం జరుగుతున్న యుద్ధంగా రూపొందించారు. ఈ నేపథ్యంలో పవన్ నటన, ప్రత్యేకించి యాక్షన్ సన్నివేశాలు, కీరవాణి అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ఊపు తీసుకొచ్చాయి
- By Sudheer Published Date - 06:54 AM, Thu - 24 July 25

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veeramallu)చిత్రం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అర్ధరాత్రి నుండే అన్ని చోట్లా ప్రీమియర్స్ షోలు పడ్డాయి. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో, ఏఎమ్ రత్నం నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించారు. అయితే, సినిమా చూసిన వెంటనే నెటిజన్లు , అభిమానులు సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని పంచుకోవడంతో సినిమా భావిత్వం ఏంటి అనేది తెలిసిపోతుంది.
నెటిజన్ ట్వీట్ ప్రకారం.. దర్శకుడు చరిత్రను కల్పనతో కలిపి ఒక ఆసక్తికరమైన కథనాన్ని అందించాలనుకున్నప్పటికీ, ఆ ప్రయత్నం పూర్తిగా విఫలమైంది. చారిత్రక అంశాలు, కాల్పిత కథ సరిగా కలవకపోవడం వల్ల కథనం పట్టు కోల్పోయింది. సినిమాలోని డ్రామా చాలా స్లో గా , సాగదీతతో సాగిందని అభిప్రాయపడుతున్నారు, ఇది ప్రేక్షకులను కథతో కనెక్ట్ చేయడంలో విఫలమైందని , అయితే సంభాషణలు చాలా బాగా రాశారని చెప్పడం ఒక సానుకూల అంశం. కానీ కేవలం సంభాషణలు మాత్రమే సినిమాను కాపాడలేకపోయాయని చెపుతున్నారు.
Sleeping Tips: రాత్రి నిద్రించే ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
VFX (విజువల్ ఎఫెక్ట్స్) అంత బాగాలేదని , సినిమా సాంకేతిక వర్గంలో చాల లోపాలు స్పష్టంగా కనిపించాయని, డబ్బింగ్ కూడా బాగోలేదని ఇది సినిమాకు పెద్ద మైనస్ అని చెపుతున్నారు. మొదటి భాగం పూర్తిగా బలహీనంగా ఉండటంతో, విరామం మాత్రమే ప్రేక్షకులను హమ్మయ్య అనిపించేలా ఉందని చెపుతున్నారు. మొదటి సగం చాలా బలహీనంగా ఉండటం వల్ల, రెండవ సగంపైనే సినిమా భారం పడిందని కానీ అది పెద్ద అంతే ఉండడం తో అభిమానులు చాల నిరాశకు గురి అయ్యారు.
సోషల్ మీడియా టాక్ ప్రకారం చెప్పాలంటే.. మొఘల్ సామ్రాజ్యాన్ని కదిలించి, ఔరంగజేబు నుంచి కోహినూర్ వజ్రాన్ని తీసుకురావాలన్న గొప్ప లక్ష్యంతో హీరో ఢిల్లీకి ప్రయాణం చేయడం కథకు కీలక మలుపు. ఇది యుద్ధ నాయకుడిగా పవన్ పోరాటాన్ని చూపిస్తూ, కేవలం కోహినూర్ కోసం కాదని, ఒక జాతి గౌరవం కోసం జరుగుతున్న యుద్ధంగా రూపొందించారు. ఈ నేపథ్యంలో పవన్ నటన, ప్రత్యేకించి యాక్షన్ సన్నివేశాలు, కీరవాణి అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ఊపు తీసుకొచ్చాయి.
ఈ సినిమాను తెరపై నిలిపేందుకు పవన్ కల్యాణ్ చేసిన శ్రమ స్పష్టంగా కనిపిస్తుంది. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందించిన ఈ చిత్రంలో ప్రీ-క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. పవన్ నటనలో నాటకీయత, పాత్రతో మమేకమవడం స్పష్టంగా చూపించబడింది. అలాగే కథనంలో ఉన్న కొన్ని భావోద్వేగాల సన్నివేశాలు, మ్యూజిక్ స్కోర్ ప్రేక్షకుల మదిని కొంతవరకు గెలుచుకున్నాయి.
అయితే ఈ సినిమాలో పలు తడబాట్లు ప్రేక్షకులను నిరాశపరిచాయి. ముఖ్యంగా VFX దృశ్యాలు స్థాయికి తగ్గట్టుగా లేవు. స్క్రీన్ ప్లే తేలికగా సాగి కథ సాగదీతగా అనిపిస్తుంది. పాత్రల లిప్ సింక్ లో లోపాలు కనిపించడంతో భావాలు గమ్యం కావడం లేదు. ఇక క్లైమాక్స్ లో బలహీనత స్పష్టంగా కనిపించగా, కథ ఎటో తెలియని ముగింపుతో రెండో భాగానికి హింట్ ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు ఓ మోస్తరు అనుభవాన్ని ఇచ్చినప్పటికీ, సాధారణ ప్రేక్షకులకు మాత్రం నిరాశ కలగడం ఖాయం.