Happy Birthday Prabhas: ‘ఆది పురుషుడు’ పోస్టర్ రిలీజ్…సెకండ్ లుక్ అదుర్స్..!!
నేడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు. ఇవాళ్టితో ప్రభాస్ లో 43వ వసంతంలోకి అడుగుపెట్టారు.
- By hashtagu Published Date - 11:21 AM, Sun - 23 October 22

నేడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు. ఇవాళ్టితో ప్రభాస్ లో 43వ వసంతంలోకి అడుగుపెట్టారు. ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది చిత్ర యూనిట్. ఆదిపురుష్ నుంచి కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ పోస్టర్ లో చేతిలో బాణం, విల్లు ఎక్కిపెట్టి యుద్ధరంగంలో నిలిచినట్లు ప్రభాస్ లుక్ అదుర్స్ అనిపించేలా ఉంది. ఈ పోస్టర్ చూసిన ప్రభాష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ప్రభాస్ శ్రీరాముడిగా అభిమానుల గుండెల్లో నిలిచిపోయాడు. నిప్పులు చిమ్ముతున్న మేఘాలు, వెనక నిలబడిన వానర సైన్యం, ప్రభాస్ సీరియస్ గెటప్…మరసటి క్షణంలో రావణుడిని చంపబోతున్నట్లుగా ఉన్న పోస్టర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. మర్యాద పురుషోత్తం ప్రభు శ్రీరామ్ అనే క్యాప్షన్ జోడించారు.