Happy Birthday Jr NTR :దమ్ము చూపుతూ దుమ్ము లేపుతున్న ఎన్టీఆర్
Happy Birthday Jr NTR : జూనియర్ ఎన్టీఆర్.. హావభావాలు, డ్యాన్స్, డైలాగ్ డెలివరీ వెరీ వెరీ స్పెషల్ !!
- By Pasha Published Date - 04:00 PM, Sat - 20 May 23

Happy Birthday Jr NTR : జూనియర్ ఎన్టీఆర్.. హావభావాలు, డ్యాన్స్, డైలాగ్ డెలివరీ వెరీ వెరీ స్పెషల్ !! సీనియర్ ఎన్టీఆర్ ను తలపించే ముఖ వర్ఛస్సును వరంగా పొందిన రియల్ హీరో జూనియర్ ఎన్టీఆర్ !! చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి టాలీవుడ్ టాప్ మోస్ట్ హీరోగా ఆయన ఎదిగిన తీరు స్ఫూర్తిదాయకం. యంగ్ టైగర్‌గా దమ్ము చూపుతూ దుమ్ము లేపుతున్నాడు ఎన్టీఆర్.రామాయణం సినిమాలో రాముడిగా కెరీర్ మొదలు పెట్టి.. ఆర్ఆర్ఆర్‌లో భీముడుగా తనకు తానే సాటి అనిపించుకున్నారు. ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే (Happy Birthday Jr NTR) సందర్భంగా ఆయన సినీ కెరీర్ పై ఓ లుక్ వేద్దాం..
మూవీ ఇండస్ట్రీలోకి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్‌తో అడుగు పెట్టినా.. తన స్వయంకృషితో టాలీవుడ్‌లో సొంత ఐడెండిటీని జూనియర్ ఎన్టీఆర్ ఏర్పరుచుకున్నారు. హీరోగా 21 ఏళ్ల ప్రస్థానాన్ని ఆయన పూర్తి చేసుకున్నారు. తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమరం భీమ్ పాత్రలో ఇరగదీశాడు. త్వరలో ‘దేవర’గా సినీ అభిమానులను పలకరించనున్నాడు. రెండు దశాబ్దాల సినీ కెరీర్‌లో డిఫరెంట్ పాత్రలతో ఎన్టీఆర్ అలరించాడు. బిగ్‌బాస్, ఎవరు మీలో కోటీశ్వరుడు వంటి రియాలిటీ షోలతో స్మాల్ స్క్రీన్ ప్రేక్షకులకు చేరువయ్యాడు. ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే.. 2001లో ఉషాకిరణ్ మూవీస్ వారి ‘నిన్నుచూడాలని’ చిత్రంతో హీరోగా జూనియర్ ఎన్టీఆర్ పరిచయం అయ్యాడు . కానీ ఆ మూవీ ఆశించిన విజయం సాధించలేదు.
రాజమౌళి పరిచయం ఒకవరంగా
ఈక్రమంలో తారక్ కు రాజమౌళి పరిచయం ఒకవరంగా మారింది. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘స్టూడెంట్ నెం.1’ సక్సెస్ అయింది. నాటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ వెనుతిరిగా చూసుకోలేదు. సింహాద్రి హిట్ తర్వాత జూనియర్‌ను వరుస పరాజయాలు పలకరించాయి. ఆంధ్రావాలా, సాంబ, నాఅల్లుడు, నరసింహుడు, అశోక్ చిత్రాలు ఒకదాని వెనక ఒకటి క్యూ కట్టి ఫ్లాపైనా… నటుడిగా తారక్ ఎన్నడూ ఫెయిల్ కాలేదు. ఈ మూవీస్ తర్వాత కృష్ణవంశీ డైరెక్షన్లో వచ్చిన ‘రాఖీ’ ఎన్టీఆర్ నటనలో మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. ఈ సినిమాతో తారక్ మహిళ ప్రేక్షకాభిమానం భారీగా సంపాదించారు.