HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Hanuman Teja Sajja Next Miray Budget Details

Teja Sajja : హనుమాన్ హీరో నెక్స్ట్ బిగ్ బడ్జెట్ మూవీ.. మిరాయ్ టైటిల్ అర్ధం అదేనా..!

యువ హీరో తేజా సజ్జ (Teja Sajja ) తన లేటెస్ట్ మూవీ హనుమాన్ తో సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకు పాన్ ఇండియా

  • Author : Ramesh Date : 17-01-2024 - 9:14 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hanuman Hero not Accepting Advances here is the Reason
Hanuman Hero not Accepting Advances here is the Reason

యువ హీరో తేజా సజ్జ (Teja Sajja ) తన లేటెస్ట్ మూవీ హనుమాన్ తో సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకు పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ రాగా వసూళ్లు కూడా 100 కోట్ల గ్రాస్ సంపాధించింది. సినిమాపై ఇప్పుడిప్పుడే సెలబ్రిటీస్ ప్రమోషన్ కలిసి వస్తుంది. సినిమా చూసిన వారెవరైనా సరే సూపర్ అన్న మాట తప్ప మరో మాట రావట్లేదు. సంక్రాంతికి షూర్ షాట్ విన్నర్ గా బాక్సాఫీస్ పై కూడా హనుమాన్ తన వీర ప్రతాపం చూపిస్తున్నాడు.

We’re now on WhatsApp : Click to Join

హనుమాన్ తో హీరోగా తన ఖాతాలో మరో హిట్ వేసుకున్న తేజా సజ్జ తన నెక్స్ట్ సినిమా రేంజ్ పెంచుకున్నాడు. యువ హీరోతో హనుమాన్ సినిమాను 30 కోట్ల బడ్జెట్ లోపే సినిమా పూర్తి చేశారు. అయినా కూడా అది ఎక్కువ బడ్జెట్ అనే అనుకున్నారు. కానీ హనుమాన్ సృష్టిస్తున్న సంచలనాలు చూసి అందరు అవాక్కవుతున్నారు.

హనుమాన్ తర్వాత తేజా సజ్జ మిరాయ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ చేస్తున్నాడు. ఈగల్ తర్వాత కార్తీక్ డైరెక్ట్ చేసే సినిమా ఇదే. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ 40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. సినిమాలో తేజా సజ్జాతో పాటుగా మంచు మనోజ్, దుల్కర్ సల్మాన్ లు కూడా భాగం అవుతున్నారని తెలుస్తుంది. తేజా సజ్జా సినిమాలో వారిద్దరు కూడా కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం సినిమాకు మేజర్ హైలెట్ అవుతుంది.

Also Read : Venkatesh Saindhav : వెంకటేష్ సైంధవ్ ని అందుకే ఎవరు పట్టించుకోలేదా..?

ఎలాగు హనుమాన్ సూపర్ హిట్ కాబట్టి ఆ క్రేజ్ తో మిరాయ్ బిజినెస్ కూడా అదిరిపోతుంది. అయితే మిరాయ్ అంటే టైటిల్ అర్ధం ఆయుధం అని తెలుస్తుంది. తన ప్రతి కథను డిఫరెంట్ గా ప్లాన్ చేసుకుంటూ వస్తున్న తేజా సజ్జ టాలీవుడ్లో సరికొత్త సంచలనాలు సృష్టించేలా ఉన్నాడని చెప్పొచ్చు. ఓ బేబీ సినిమాలో సమంత తో కలిసి నటించిన తేజా హనుమాన్ తో తన రేంజ్ పెంచుకున్నాడు.

తేజా సజ్జా సక్సెస్ ట్రాక్ చూశాక అతనితో సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా హనుమాన్ సినిమాలో అతని కన్విక్షన్ చూశాక కుర్రాడిలో టాలెంట్ బాగానే ఉందని చెప్పుకుంటున్నారు. హనుమాన్ ఫుల్ రన్ లో అద్భుతాలు చేస్తుందని నమ్ముతుండగా తేజా నెక్స్ట్ సినిమాలపై ఈ ఇంపాక్ట్ కచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు. తేజ సజ్జ మిరాయ్ అప్డేట్స్ కోసం ఆడియన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hanuman
  • Karthik Ghattamaneni
  • Miray
  • Teja Hanuman
  • teja sajja
  • Teja Sajja Miray
  • tollywood

Related News

Allu Arjun appeal to Delhi high court for his privacy

Allu Arjun: వ్యక్తిగత హక్కుల కోసం హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్

Delhi High Court సినిమా రంగంలో తనదైన బ్రాండ్ సృష్టించుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఇప్పుడు తన వ్యక్తిగత హక్కుల పరిరక్షణ కోసం న్యాయక్షేత్రంలో అడుగుపెట్టారు. తన అనుమతి లేకుండా తన పేరు, ఫొటోలు, చివరకు తన వాయిస్‌ను కూడా వాణిజ్య ప్రయోజనాల కోసం వాడుకోకుండా చూడాలని కోరుతూ ఆయన ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ముప్పు పొంచి ఉన్న ఈ కాలంలో

  • Meenakshi Seshadri Dance Re-creation Aapadbandhavudu movie song

    Meenakshi Seshadri: 62 ఏళ్లలో అదరగొట్టేసిన మీనాక్షీ శేషాద్రి

  • Nivetha Pethuraj

    Nivetha Pethuraj: బ్రేకప్ తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్న నివేదా పేతురాజ్!

  • Producer Supriya Yarlagadda Speech at Dacoit Movie Success Meet

    Dacoit: ‘డెకాయిట్’ మా నమ్మకాన్ని నిలబెట్టింది – సుప్రియ యార్లగడ్డ

Latest News

  • BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

  • రేప‌టితో ముగియ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌చారం..!

  • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

  • కియా కారు.. రూ. 3.20 ల‌క్ష‌ల వ‌ర‌కు డిస్కౌంట్‌!

  • నిద్ర‌లేమి స‌మ‌స్య‌.. క‌ళ్ల‌పై ప్ర‌భావం?

Trending News

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd