Hanuman : హనుమాన్ ఇంకా రేసులో ఉంది.. స్టార్ సినిమాలు కూడా ఈ రేంజ్ ప్లాన్ లేదు..!
Hanuman తేజ సజ్జా లీడ్ రోల్ లో ప్రశాంత్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా హనుమాన్. సంక్రాంతి రేసులో రిలీజైన ఈ సినిమా స్టార్ సినిమాలను వెనక్కి నెట్టి మరీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కేవలం తెలుగులోనే కాదు పాన్ ఇండియా
- By Ramesh Published Date - 08:18 PM, Fri - 16 February 24

Hanuman తేజ సజ్జా లీడ్ రోల్ లో ప్రశాంత్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా హనుమాన్. సంక్రాంతి రేసులో రిలీజైన ఈ సినిమా స్టార్ సినిమాలను వెనక్కి నెట్టి మరీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కేవలం తెలుగులోనే కాదు పాన్ ఇండియా లెవెల్ లో హనుమాన్ ప్రభంజనం తెలిసిందే. రిలీజై నెల రోజులు పైన అవ్వగా సినిమా 300 కోట్ల పైగా వసూళ్లను రాబట్టింది.
హనుమాన్ సినిమా తో రిలీజైన సినిమాలన్నీ థియేట్రికల్ రన్ పూర్తి చేసుకోగా హనుమాన్ మాత్రం ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగిస్తుంది. అయితే హనుమాన్ సినిమా ఆడియన్స్ కోసం మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ముఖ్యంగా నైజాం ఆడియన్స్ ని సినిమా చూసేలా టికెట్ ప్రైజ్ లను తగ్గించారు.
నేటి నుంచి ఫిబ్రవరి 23 వరకు హనుమాన్ సినిమా మల్టీప్లెక్స్ లో 150, సింగిల్ స్క్రీన్స్ లో 100 రూపాయలు మాత్రమే టికెట్ ప్రైజ్ కేటాయించారు. దీని వల్ల ఇప్పటివరకు సినిమా చూడని వారు కూడా హనుమాన్ చూసే ఛాన్స్ ఉంటుంది. అంతేకాదు టికెట్ ప్రైజ్ తగ్గించారు కాబట్టి సినిమాను మరోసారి చూడాలని అనుకునే వారు కూడా మరోసారి చూస్తారు. మొత్తానికి హనుమాన్ టీం ఇంకా రేసులో ఉందని చెప్పేలా సినిమా రిలీజై నెల రోజులు అవుతున్నా ఇంకా వసూళ్లు రాబట్టేలా అదిరిపోయే ప్లాన్ వేశారని చెప్పొచ్చు.
Also Read : Chiranjeevi : ఫోటో చెబుతున్న సీక్రెట్.. సినిమా అనౌన్స్ చేయడమే లేట్..!