Hanuman Raghunandana Song : హనుమాన్ రఘునందన సాంగ్ వచ్చేసిందోచ్..!
Hanuman Raghunandana Song ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తేజ సజ్జ లీడ్ లో లో తెరకెక్కిన సినిమా హనుమాన్. ఫస్ట్ ఇండియన్ సూపర్ హీరో సినిమాగా హనుమాన్ భారీ అంచనాలతో
- Author : Ramesh
Date : 21-02-2024 - 7:34 IST
Published By : Hashtagu Telugu Desk
Hanuman Raghunandana Song ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తేజ సజ్జ లీడ్ లో లో తెరకెక్కిన సినిమా హనుమాన్. ఫస్ట్ ఇండియన్ సూపర్ హీరో సినిమాగా హనుమాన్ భారీ అంచనాలతో రిలీజ్ అవగా సినిమా సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. సంక్రాంతికి రిలీజైన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో 300 కోట్ల ను కలెక్ట్ చేసింది.
ఈ సినిమాకు గౌర హరి మ్యూజిక్ అందించాడు. సినిమాలో సర్ ప్రైజింగ్ గా రఘునందన సాంగ్ ఆడియన్స్ ని అలరించింది. సినిమాలో ఈ సాంగ్ ని కృష్ణ చైతన్య రచించగా ఆ పాటను సాయి చరణ్ భాస్కరుని, హర్షవర్ధన్ చావలి, లోకేశ్వరి ఈదర పాడారు.
సినిమా చూసినప్పటి నుంచి ఈ రఘునందన సాంగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆడియన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూశారు. ఫైనల్ గా వారి వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేసి సినిమా నుంచి ఆ సాంగ్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. తెలుగుతో పాటుగా మిగతా అన్ని భాషల్లో కూడా హనుమాన్ నుంచి రఘునందన సాంగ్ రిలీజ్ చేశారు.
ప్రస్తుతం యూట్యూబ్ లో ఈ సాంగ్ ట్రెండింగ్ లో ఉంది. హనుమాన్ సూపర్ హిట్ అవ్వడంతో జై హనుమాన్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారని తెలుస్తుంది.