ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ దేవర 2 అప్పుడే.. స్టార్ట్
- Author : Vamsi Chowdary Korata
Date : 27-01-2026 - 12:34 IST
Published By : Hashtagu Telugu Desk
Devara 2 యంగ్ టైగర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ హీరో-హీరోయిన్లుగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘దేవర’ పార్ట్-1 పాన్-ఇండియా స్థాయిలో భారీ సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందా? లేదా? అనే అనుమానాలు ప్రేక్షకులల్లో పెరుగుతున్న వేళ… నిర్మాత మిక్కిలినేని సుధాకర్ స్పష్టమైన అప్‌డేట్ ఇచ్చారు.
- పార్ట్ 2 మే నెలలో ప్రారంభమవుతుందన్న నిర్మాత
- 2027లో సినిమాను విడుదల చేస్తామని వెల్లడి
- భారీ సక్సెస్ సాధించిన జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’
ఒక ప్రైవేట్ ఈవెంట్‌లో సుధాకర్ మాట్లాడుతూ… “దేవర 2 షూటింగ్ ఈ ఏడాది మే నెలలో ప్రారంభమవుతుంది. అలాగే ఈ సినిమాను 2027లో థియేటర్లలో విడుదల చేస్తాం” అంటూ స్పష్టమైన ప్రకటన చేశారు. ఈ వ్యాఖ్యలు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో సంతోషాన్ని నింపాయి. గత కొన్ని నెలలుగా ‘దేవర 2’పై ఎలాంటి అప్‌డేట్ రాకపోవడంతో, సీక్వెల్ రద్దు అవుతుందేమో అనే డౌట్స్ నెలకొన్నాయి. కానీ ఇప్పుడు నిర్మాత చేసిన ప్రకటనతో అనుమానాలు తొలగిపోయాయి.
కొరటాల శివ – ఎన్టీఆర్ కాంబినేషన్ ఇప్పటికే ‘జనతా గ్యారేజ్’, ‘దేవర’తో బ్యాక్-టు-బ్యాక్ సూపర్ హిట్స్ ఇచ్చింది. ఇప్పుడు ‘దేవర 2’తో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇప్పుడు జోష్‌లో ఉన్నారు – “దేవర 2 కోసం వెయిట్ చేస్తున్నాం”, “హ్యాట్రిక్ హిట్ ఖచ్చితం” అంటూ పోస్టులు పెడుతున్నారు.