Devara : కొరటాల ఫై ఆగ్రహంతో ఊగిపోతున్న ఫ్యాన్స్
Devara : అభిమానులు ఎన్ని అంచనాలు పెట్టుకున్నారో..వాటిన్నింటిని కొరటాల రివర్స్ చేసాడు. ఎన్టీఆర్ కు ప్రాణం ఇచ్చే అభిమానికి కూడా సినిమా నచ్చలేదంటే అర్ధం చేసుకోవాలి ఏ రేంజ్ లో తెరకెక్కించాడో
- By Sudheer Published Date - 11:21 AM, Fri - 27 September 24

డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva)..తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి తర్వాత హయ్యస్ట్ సక్సెస్ రేట్ ఉన్న స్టార్ డైరెక్టర్. మాటల రచయితగా సుపరిచితమైన శివ.. 2013లో ప్రభాస్ హీరోగా వచ్చిన మిర్చి సినిమాతో దర్శకుడిగా మారాడు. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టి వార్తల్లో నిలిచాడు. ఆ తర్వాత మహేష్ బాబు తో శ్రీమంతుడు , ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ , భరత్ అను నేను వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి ఇండస్ట్రీ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత చిరంజీవి (Chiranjeevi) తో ఆచార్య (Acharya) మూవీ చేసాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ అయ్యింది. అప్పటివరకు ఉన్న హిట్లను సైతం మరచిపోయి..శివ ఫై అభిమానులు రెచ్చిపోయారు.
Read Also : Devara Craze : రూ.2 వేలు పలుకుతున్న టికెట్ ధర
కాస్త గ్యాప్ తీసుకొని ఎన్టీఆర్ తో దేవర చేసాడు. గతంలో ఎన్టీఆర్ – శివ కలయికలో జనతా గ్యారేజ్ సూపర్ హిట్ కావడం తో..దేవర ఫై అందరిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లే ఈరోజు ఈ మూవీ పాన్ ఇండియా గా పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అభిమానులు ఎన్ని అంచనాలు పెట్టుకున్నారో..వాటిన్నింటిని కొరటాల రివర్స్ చేసాడు. ఎన్టీఆర్ కు ప్రాణం ఇచ్చే అభిమానికి కూడా సినిమా నచ్చలేదంటే అర్ధం చేసుకోవాలి ఏ రేంజ్ లో తెరకెక్కించాడో..వందలు ఖర్చు పెట్టుకొని థియేటర్స్ కు వెళ్లిన అభిమానులకు బాధతో బయటకు వస్తున్నారు. శివ కనిపిస్తే కొడతాం అంటూ హెచ్చరిస్తున్నారు. కథ లేదు..స్క్రీన్ ప్లే లేదు..హీరోయిన్ ఎందుకు పెట్టారో తెలియదు..ఆఖరికి ‘దావూదీ’ సాంగ్ అనేదే లేకుండా చేసారు. అసలు ఈ కథ కు ఎన్టీఆర్ ఎలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారో..మళ్లీ దీనికి రెండో పార్ట్ ఎందుకు..? అని ఫైర్ అవుతున్నారు. ఇక సోషల్ మీడియా లో అయితే ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు. మరో ఆచార్య అని ఎద్దేవా చేస్తున్నారు.
Read Also : Devara Review Rating : దేవర రివ్యూ & రేటింగ్