EMI : ఈఎంఐ కట్టలేదని.. వేలానికి ప్రముఖ హీరో ఇల్లు..!!
EMI : తమిళ హీరో జయం రవి (Jayam Ravi) వ్యక్తిగత జీవితంపై వివాదం రేగుతోంది. సమాచారం ప్రకారం, చెన్నైలో ఆయన కొనుగోలు చేసిన ఇంటిపై బ్యాంక్ అధికారులు నోటీసులు అంటించారు
- By Sudheer Published Date - 02:12 PM, Thu - 25 September 25

తమిళ హీరో జయం రవి (Jayam Ravi) వ్యక్తిగత జీవితంపై వివాదం రేగుతోంది. సమాచారం ప్రకారం, చెన్నైలో ఆయన కొనుగోలు చేసిన ఇంటిపై బ్యాంక్ అధికారులు నోటీసులు అంటించారు. గత పది నెలలుగా EMIలు చెల్లించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మూడేళ్ల క్రితం జయం రవి రూ.7.64 కోట్ల లోన్ తీసుకొని ఈ ఇంటిని కొనుగోలు చేశారు. అయితే సమయానికి రుణాన్ని చెల్లించకపోతే ఆ ఇంటిని వేలం వేస్తామని బ్యాంక్ అధికారులు హెచ్చరించారు.
Gold Price Today : ఈరోజు భారీగా తగ్గిన గోల్డ్ ధరలు
జయం రవి వ్యక్తిగత సమస్యల కారణంగా ఈ పరిస్థితి ఎదురయ్యిందనే వార్తలు వినిపిస్తున్నాయి. భార్య ఆర్తితో విభేదాలు రావడంతో, ఇటీవల ఆయన గర్ల్‌ఫ్రెండ్ కెనీషాతో వేరే చోట నివసిస్తున్నారని తమిళ మీడియా రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఈ కారణంగా ఇంటి EMI చెల్లింపులు నిర్లక్ష్యానికి గురై, రుణం పేరుకుపోయినట్లు సమాచారం. దీంతో ఆయన భార్య, పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు.
ఈ వార్త వెలుగులోకి రాగానే నెటిజన్లు జయం రవిపై తీవ్రంగా మండిపడుతున్నారు. కుటుంబాన్ని పక్కనబెట్టి, వ్యక్తిగత జీవితంలో అలజడి సృష్టించుకోవడం వల్ల భార్య, పిల్లలు రోడ్డునపడే పరిస్థితి వచ్చిందని విమర్శలు చేస్తున్నారు. ఒక ప్రముఖ నటుడిగా, సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన సమయంలో ఇలాంటి వ్యవహారం ఆయన ఇమేజ్‌కు పెద్ద దెబ్బతీస్తుందని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామంపై జయం రవి స్పందించాల్సి ఉందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.