HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Eye Doll Manager Arrested 3 Crores Seized In Account

Ibomma : ఐబొమ్మ నిర్వాహకుడు అరెస్ట్.. అకౌంట్ లో 3 కోట్లు సీజ్.!

  • Author : Vamsi Chowdary Korata Date : 15-11-2025 - 10:44 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
iBomma
iBomma

టాలీవుడ్‌ నిర్మాతలకి కొన్నాళ్లుగా చుక్కలు చూపిస్తున్న వెబ్‌సైట్ ఐబొమ్మ. ముఖ్యంగా ఓటీటీ, పైరసీ కంటెంట్‌ని విచ్చలవిడిగా ఆన్‌లైన్‌లో తమ వెబ్‌సైట్‌లో పెట్టేస్తుంది ఐబొమ్మ. ఎన్నిసార్లు నిర్మాతలు దీనిపై ఫిర్యాదు చేసినా ఇప్పటివరకూ ఐబొమ్మ కీలక నిర్వాహకుల్ని మాత్రం పోలీసులు పట్టుకోలేకపోయారు. అయితే తాజాగా ఈ కేసులో బిగ్గెస్ట్ బ్రేక్ వచ్చింది. ఐబొమ్మ కీలక నిర్వాహకులు ఇమ్మడి రవిని తాజాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలు చూద్దాం.

దమ్ముంటే పట్టుకోరా షెకావత్.. పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్.. అనే డైలాగ్ పుష్ప 2లో ఎంత ఫేమస్ అయిందో తెలిసిందే. అయితే ఇదే రేంజ్‌లో తెలంగాణ పోలీసులకి గతంలో ఐబొమ్మ వార్నింగ్ ఇచ్చింది. మమ్మల్ని పట్టుకోవాలని చూస్తే మా దగ్గరున్న ఎంతోమంది సమాచారాన్ని లీక్ చేస్తామంటూ పోలీసులకే ఓపెన్ వార్నింగ్ ఇచ్చారు ఐబొమ్మ నిర్వాహకులు.

అయితే ఈ వార్నింగ్‌ని అంతే సీరియస్‌గా తీసుకున్న తెలంగాణ పోలీసులు అప్పటి నుంచి ఐబొమ్మ నిర్వాహకుల్ని పట్టుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికి ఈ కేసు తాజాగా కీలక మలుపు తిరిగింది. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. కూకట్‌పల్లిలో అతడ్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ వెబ్‌సైట్‌ని నిర్వహిస్తున్న రవి.. నిన్న ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు పక్కా స్కెచ్‌తో రవిని అరెస్ట్ చేశారు. ఐబొమ్మ వెబ్‌సైట్ ద్వారా ఓటీటీ, పైరసీ కంటెంట్‌ని రవి ఆన్‌లైన్‌లో పెడుతున్నాడు.

రవి తన భార్యతో విడిపోయి ఒంటరిగా ఉంటున్నట్లు సమాచారం. ఇక రవి అకౌంట్‌లో ఉన్న రూ.3 కోట్లను పోలీసులు ఫ్రీజ్ చేశారట. తెలుగు సినీ నిర్మాతల ఫిర్యాదుతోనే ఈ అరెస్ట్ జరిగింది. దమ్ముంటే పట్టుకోవాలంటూ గతంలో పోలీసులకి కూడా రవి సవాల్ చేశాడు. ప్రస్తుతం సర్వర్లలో ఉన్న పైరసి కంటెంట్‌ని పోలీసులు చెక్ చేస్తున్నారు.

గతంలో తమ వెబ్‌సైట్ ద్వారా పోలీసులకి ఐబొమ్మ నిర్వాహకులు వార్నింగ్ ఇచ్చారు. “సినీ ఇండస్ట్రీలో కొంతమంది మాపై పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కానీ మేం ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజులు, సబ్‌స్క్రిప్సన్లు వసూలు చేయడం లేదు. మా సైట్లో అన్ని సినిమాలు ఉచితంగానే చూడొచ్చు.

హీరోలకు వందల కోట్ల రూపాయలు రెమ్యునరేషన్లు ఇస్తున్నారు. విలాసవంతమైన ట్రిప్పులు నిర్వహించి వాటి భారాన్ని సామన్యులపై వేస్తారా. సినీ ఇండస్ట్రీ నష్టాలకు కారణం మేం కానే కాదు.. నిర్మాతలు, హీరోలే దీనికి కారణం. సినిమా బడ్జెట్లో ఎక్కువ శాతం హీరోల రెమ్యునరేషన్లకే వెళ్లిపోతుంది. విదేశాల్లో షూటింగుల పేరుతో బడ్జెట్‌ని విపరీతంగా పెంచేస్తున్నారు. అదే ఇండియాలో షూటింగ్ చేస్తే ఖర్చు తగ్గుతుంది. అనవసర ఖర్చు పెట్టేసి దాని రికవరీ కోసం ప్రేక్షకుల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు. చావుకి భయపడని వాడు దేనికీ భయపడడు. మేం ఎక్కడున్నా భారతీయుల కోసం మరీ ముఖ్యంగా తెలుగు వాళ్ల కోసం పనిచేస్తూనే ఉంటాం” అంటూ ఐబొమ్మ పోస్ట్ పెట్టింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cinema industry
  • Emmadi Ravi
  • iBOMMA
  • Ibomma - Telugu Producers
  • tollywood

Related News

Shivaji

శివాజీ పై ‘కుట్ర’ చేస్తున్నది ఎవరు ? ఎందుకు ఆయన ఆ మాటలు అన్నారు ?

హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్పై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మహిళా కమిషన్ విచారణ అనంతరం ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 'నాపై కుట్ర జరిగింది. జూమ్ మీటింగ్స్ పెట్టుకున్నారు

  • Roshan Meka

    టాలీవుడ్‌లో రోషన్ జోరు.. క్రేజీ డైరెక్టర్లతో భారీ ప్రాజెక్టులు!

  • Sivajii

    నా స్నేహితులు కూడా నాపై కుట్ర చేస్తున్నారు.. శివాజీ కీలక వ్యాఖ్యలు

  • Prakash Raj Reaction On Siv

    శివాజీకి వార్నింగ్ ? అనసూయకు సపోర్ట్ గా ప్రకాష్‌ రాజ్‌..!

  • Telangana Women Commission

    మహిళా కమిషన్‌ విచారణకు హాజరైన నటుడు శివాజీ!

Latest News

  • ఆరోగ్యకరమైన నిద్రకు ఏ వైపు తిరిగి పడుకోవాలి?

  • వైరల్ అవుతున్న చరణ్, ధోని, సల్మాన్ ఫోటో ఇదే!

  • మన్ కీ బాత్ 129వ ఎపిసోడ్.. 2025లో విజయాలు, భారత్ గర్వించదగ్గ క్షణాలీవే!

  • టీమిండియాకు గుడ్ న్యూస్‌.. జ‌ట్టులోకి స్టార్ ఆట‌గాడు!

  • జార్ఖండ్‌ను వణికిస్తున్న చలి పులి.. 7 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ!

Trending News

    • పీఎం కిసాన్ పథకం.. ఒకే కుటుంబంలో ఎంతమందికి లబ్ధి చేకూరుతుంది?

    • జనవరి 2026 నుండి మారనున్న 10 కీలక నిబంధనలీవే!

    • గౌతమ్ గంభీర్ ఉద్వాసనపై బీసీసీఐ స్పష్టత.. ఆ వార్తల్లో నిజం లేదు!

    • మీ క్రెడిట్ కార్డ్ వాడకం మీ లోన్ అర్హతను దెబ్బతీస్తోందా?

    • టెస్ట్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ ఔట్‌?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd