Niharika Ex-Husband : నిహారిక డివోర్స్ ఇంటర్వ్యూపై మాజీ భర్త స్ట్రాంగ్ కౌంటర్.. జాగ్రత్త అంటూ?
ఇంతకీ ఏం జరిగిందంటే. నిహారిక (Niharika) యూట్యూబర్ నిఖిల్ విజయేంద్రకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విడాకులకు గల కారణాలు వివరించింది.
- Author : Vamsi Chowdary Korata
Date : 27-01-2024 - 12:41 IST
Published By : Hashtagu Telugu Desk
Niharika Ex-Husband : విడాకుల తర్వాత ఒక యూట్యూబర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తొలిసారి విడాకుల అంశంపై స్పందించింది నిహారిక (Niharika). అయితే ఆ హోస్ట్ ఆ ఇంటర్వ్యూ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా చైతన్య జొన్నలగడ్డ స్ట్రాంగ్ గా రిప్లై ఇచ్చాడు. ఒకవైపు నుంచి సమస్యని చూడొద్దంటూ ఫైర్ అయ్యాడు. ఇంతకీ ఏం జరిగిందంటే. నిహారిక (Niharika) యూట్యూబర్ నిఖిల్ విజయేంద్రకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విడాకులకు గల కారణాలు వివరించింది.
We’re now on WhatsApp. Click to Join.
మనుషులను త్వరగా నమ్మకూడదనే విషయం తనకి పెళ్లి తర్వాతే తెలిసింది అన్నది నిహారిక అంతేకాక పెళ్ళికి ముందు తల్లిదండ్రుల మీద ఆధార పడతామని కానీ వివాహం తర్వాత తప్పుడు వ్యక్తి మీద ఆధారపడితే జీవితం శూన్యం అవుతుందని చెప్పుకు వచ్చింది. తర్వాత తన కుటుంబం తనకు ఎంతో మద్దతుగా నిలిచిందని తాను సంతోషంగా ఉండటమే తన కుటుంబానికి ముఖ్యమని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఒంటరిగా ఉన్నప్పటికీ చాలా సంతోషంగా ఉన్నాను. నాగబాబు లాంటి తండ్రి దొరకటం తన అదృష్టం అని చెప్పిన నిహారిక తనకి ఇంకా 30 ఏళ్ళే రెండో పెళ్లి చేసుకునే అవకాశం ఉంది అని చెప్పింది. ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది.
అయితే ఈ వీడియో పై చైతన్య జొన్నలగడ్డ స్పందిస్తూ నిహారిక గురించి ఎక్కడా ప్రస్తావించకుండా హోస్ట్ అయిన నిఖిల్ విజయేంద్ర సింహ పై సీరియస్ అయ్యాడు. పరోక్షంగా విడాకులకు తన వైపు గల కారణాలను చెప్పే ప్రయత్నం చేశాడు. హాయ్ నిఖిల్ నిహారిక మీద నెగెటివిటీ రాకుండా చూసుకునేందుకు నువ్వు చేస్తున్న ప్రయత్నం బాగానే ఉంది. కాకపోతే ఆలస్యమైంది వ్యక్తిగత సమస్యలను ఎదుర్కోవటం అంత సులభం కాదని నాకు తెలుసు కానీ ఈ ప్లాట్ఫామ్ వేదికగా మీరు పరోక్షంగా బాధితురాలు అనే ట్యాగ్ క్రియేట్ చేసే ప్రయత్నాలు మానుకోండి.
నిఖిల్ ఇలా చేయడం ఇది రెండోసారి అని చెప్పుకొచ్చాడు చైతన్య. విడాకుల విషయంలో బాధ, దాని నుంచి బయటపడటం అనేది రెండు వైపులా ఒకే విధంగా ఉంటుంది. కాకపోతే ఆ బాధ నుంచి ఎలా బయటపడ్డమనే దాని గురించి మాట్లాడితే అది జనాలకి ఉపయోగపడుతుంది. పూర్తిగా విషయం తెలుసుకోకుండా ఒక నిర్ణయానికి రావడం సరి అయినది కాదు. అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను ధన్యవాదాలు అంటూ కామెంట్ చేశాడు చైతన్య.
Also Read: Ram Charan: కొడుకుగా గర్విస్తున్నా, చిరంజీవికి పద్మావిభూషణ్ పట్ల రామ్ చరణ్ ఎమోషనల్