Emran Hashmi : ఐశ్వర్య రాయ్ ని ప్లాస్టిక్ అనేసిన నటుడు.. విపరీతమైన ట్రోలింగ్..!
Emran Hashmi బాలీవుడ్ ముద్దుల వీరుడు ఇమ్రాన్ హష్మి గురించి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఇప్పుడు థర్టీ, ఫార్టీ ప్లస్ ఉన్న వారికి వారి యంగ్ ఏజ్ లో అతను చేసిన సినిమాలు అలరించాయి.
- Author : Ramesh
Date : 24-02-2024 - 10:36 IST
Published By : Hashtagu Telugu Desk
Emran Hashmi బాలీవుడ్ ముద్దుల వీరుడు ఇమ్రాన్ హష్మి గురించి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఇప్పుడు థర్టీ, ఫార్టీ ప్లస్ ఉన్న వారికి వారి యంగ్ ఏజ్ లో అతను చేసిన సినిమాలు అలరించాయి. బాలీవుడ్ లో ఒకప్పుడు అతను చేసిన అడల్ట్ సినిమాలు షేక్ చేశాయి. ఇమ్రాన్ హష్మి నటించిన గ్యాంగ్ స్టర్, మర్డర్ 2, జన్నత్ 2, ది డర్టీ పిక్చర్ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. బాలీవుడ్ లో రొమాంటిక్ హీరోగా సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు ఇమ్రాన్ హష్మి.
అయితే మధ్యలో కొంత కెరీర్ అటు ఇటుగా సాగినా మళ్లీ తిరిగి ఫాం లోకి వచ్చాడు ఇమ్రాన్ హష్మి. ఈ క్రమంలో తను ఒకప్పుడు ఐశ్వర్య రాయ్ మీద చేసిన కామెంట్స్ పై తనని ఇప్పటికీ ట్రోల్ చేస్తున్నారని బాధ పడుతున్నాడు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇమ్రాన్ హష్మి 2014 లో కాఫీ విత్ కరణ్ షోలో ర్యాపిడ్ ఫైర్ లో భాగంగా ప్లాస్టిక్ అనే పదాన్ని ఎవరితో పోల్చుతారని అడిగితే ఇమ్రాన్ హష్మి ఐశ్వర్య రాయ్ పేరు చెప్పాడు.
ఆ ఒక్క మాట ఐశ్వర్య రాయ్ ఫ్యాన్స్ ని హర్ట్ అయ్యేలా చేసింది. ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యాక ఇమ్రాన్ హష్మి మీద ఐశ్వర్య రాయ్ ఫ్యాన్స్ విపరీతంగా పడిపోయారు. అయితే అతను ఆ టైం లో కేవలం ఆటలో భాగంగా చెప్పానే తప్ప అందులో ఎలాంటి దురుద్దేశం లేదని అన్నారు ఇమ్రాన్ హష్మి. ఎంతగా ట్రోల్ చేసి ఉంటే ఇమ్రాన్ హష్మి ఇప్పటికీ ఆ విషయాన్ని గుర్తుంచుకున్నారో అర్ధం చేసుకోవచ్చు.
ఇమ్రాన్ హష్మి కొత్త ఇన్నింగ్స్ సౌత్ లో కూడా అదరగొట్టేస్తున్నాడు. అతను ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీలో నటిస్తుండగా ఆ తర్వాత అడివి శేష్ గూఢచారి 2 లో కూడా ఛాన్స్ అందుకున్నాడు. సౌత్ సినిమా పరిశ్రమ మీద ఇటీవలే ఇక్కడ సినిమా వాళ్లు చాలా క్రమశిక్షణతో సినిమాలు చేస్తున్నారని మంచి కాంప్లిమెంట్ ఇచ్చాడు ఇమ్రాన్ హష్మి.
Also Read : Animal Tripti Dimri : యానిమల్ బ్యూటీ లవ్ లో పడిందా.. ఆ బిజినెస్ మ్యాన్ తో మ్యాటర్ చాలా దూరం వెళ్లిందట..!