Drugs Case : దసరా నటుడు అరెస్ట్ తో మరోసారి ఇండస్ట్రీ చిక్కుల్లో పడనుందా ..?
Drugs Case : కేరళలోని కోచ్చిలో ఓ స్టార్ హోటల్‌లో జరిగిన రేవ్ పార్టీలో మాదకద్రవ్యాల వాడకం జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు హోటల్‌పై దాడి చేశారు.
- By Sudheer Published Date - 09:19 PM, Sat - 19 April 25

మలయాళ నటుడు షైన్ టామ్ చాకో (Malayalam actor Shine Tom Chacko) డ్రగ్స్ కేసు(Drugs Case)లో అరెస్ట్ (Arrest) అవడంతో మళ్లీ సినీ పరిశ్రమ(Film Industry)లో మాదకద్రవ్యాల అంశం హాట్ టాపిక్‌గా మారింది. కేరళలోని కోచ్చిలో ఓ స్టార్ హోటల్‌లో జరిగిన రేవ్ పార్టీలో మాదకద్రవ్యాల వాడకం జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు హోటల్‌పై దాడి చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న షైన్ టామ్ చాకో పోలీసుల దాడిని చూసి పారిపోయిన దృశ్యాలు అక్కడే ఉన్నవారు తమ ఫోన్లలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యాయి. విచారణకు హాజరైన షైన్‌ను పోలీసులు నాలుగు గంటలపాటు ప్రశ్నించి అరెస్ట్ చేశారు.
Arsenic Alert : మనం తినే బియ్యంలో డేంజరస్ ఆర్సెనిక్.. ఏమిటిది ?
ఇటువంటి ఘటనలు ఇండస్ట్రీపై చెడు ప్రభావం చూపిస్తుంటాయి. పోటీ, ఒత్తిడి, అవకాశాల కొరత, ఫెయిల్యూర్ భయంతో కొంతమంది మాదకద్రవ్యాల బారిన పడుతుంటే, మరికొందరు డబ్బుతో సరదాలు చేద్దాం అనే ఉద్దేశంతో రెవ్ పార్టీల్లో పాల్గొంటున్నారు. దీని వల్ల సినీ పరిశ్రమపై బలమైన ముద్ర పడుతోంది. ఒక్క కేసుతో ఓ నటుడు లేదా టెక్నీషియన్ ఎంతో కష్టపడి సంపాదించిన పేరు, గుర్తింపు, భవిష్యత్తు ఒక్కసారిగా తుడిచిపెట్టుకు పోతుంది.
ఈ సమస్య ఇండస్ట్రీకే పరిమితం కాకుండా స్కూళ్లు, కాలేజీలకూ విస్తరిస్తుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. మాదకద్రవ్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారాలు ప్రకటించినప్పటికీ, కేసులు విచారణలో అలసత్వం, సమర్థవంతమైన ముగింపు లేకపోవడం వల్ల ఫలితం కనిపించడంలేదు. పైగా ప్రతి డ్రగ్స్ కేసు మాధ్యమాల్లో పెద్దగా చర్చకు వచ్చి, ఆ తర్వాత మౌనంగా అటకెక్కిపోతుండటం సినీ వర్గాల్లో మాదకద్రవ్యాల జాడ్యానికి ఊతమిస్తున్నదని చెప్పవచ్చు. మాదకద్రవ్యాల వినియోగాన్ని నిరోధించడంలో కఠిన చర్యలతో పాటు అవగాహన పెంచే కార్యక్రమాలు అత్యవసరంగా మారాయి.