Arsenic Alert : మనం తినే బియ్యంలో డేంజరస్ ఆర్సెనిక్.. ఏమిటిది ?
బియ్యంలోని ఆర్సెనిక్‌ను(Arsenic Alert) తగ్గించడం కోసం ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు.
- By Pasha Published Date - 08:38 PM, Sat - 19 April 25

Arsenic Alert : బియ్యం.. మనమంతా నిత్యం తినే ఆహార పదార్థం. భూమిలో నుంచి రకరకాల పదార్థాలు, పోషకాలు, లవణాలు పంటలోకి చేరుతుంటాయి. ఈక్రమంలోనే పొలంలోని నేల నుంచి వరిపంటలోకి ఆర్సెనిక్ చేరుతుంటుంది. ఇది హానికరమైన కెమికల్. కొన్ని రకాల బియ్యంలో ఇది ఎక్కువ మోతాదులో ఉంటుంది. దీనివల్లే బియ్యం తినేవారికి క్యాన్సర్, గుండె జబ్బులు, మధుమేహం వంటివి వస్తుంటాయి.ఆర్సెనిక్‌కు రుచి, రంగు, వాసన ఉండవు.
Also Read :MP Mithun Reddy : లిక్కర్ స్కాం.. మిథున్‌రెడ్డిని 8 గంటల్లో ‘సిట్’ అడిగిన కీలక ప్రశ్నలివీ
బ్రౌన్ రైస్‌తోనే ఎక్కువ రిస్క్
బియ్యంలోని ఆర్సెనిక్‌ను(Arsenic Alert) తగ్గించడం కోసం ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. బియ్యం నుంచి కొంత ఆర్సెనిక్‌ను తొలగించడంలో సహాయపడే వంట పద్ధతులు కూడా అందుబాటులో ఉన్నాయి. తెల్లని బియ్యాన్ని ప్రాసెస్ చేసిన విధానం వల్ల, దానిలో తక్కువ మోతాదులో అకర్బన ఆర్సెనిక్ ఉంటుంది. అందుకే ఎక్కువమంది బ్రౌన్ రైస్ తింటే.. ఆరోగ్య సమస్యల ముప్పు పెరిగే అవకాశం ఉంటుంది. వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ (CO₂) స్థాయి, ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు బియ్యంలో ఆర్సెనిక్ పరిమాణం కూడా పెరుగుతుందని పరిశోధకులు గుర్తించారు. ఆర్సెనిక్ అధిక మోతాదులో ఉన్న నీటిని ప్రపంచవ్యాప్తంగా దాదాపు 14 కోట్ల మంది ప్రజలు తాగుతున్నారు. తాజాగా శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో ఈవివరాలను గుర్తించారు. 60 కిలోల బరువున్న ఒక వ్యక్తి రోజుకు 7.8 మైక్రోగ్రాముల అకర్బన ఆర్సెనిక్ తింటే వారికి మూత్రాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం దాదాపు 3 శాతం పెరుగుతుంది. మధుమేహం వచ్చే ప్రమాదం దాదాపు ఒక శాతం పెరుగుతుంది.
Also Read :Copper Vs Gold : ‘రాగి’ మరో ‘బంగారం’ కాగలదా ? అంత సీన్ ఉందా ?
పొలాల్లో ఆర్సెనిక్ .. ఎలా ఏర్పడుతుంది ?
‘‘పొలాలను వరద ముంచెత్తితే నేల నుంచి ఆక్సిజన్ తొలగిపోతుంది. దీంతో నేలలోని కొన్ని బ్యాక్టీరియాలు జీవించడానికి ఆక్సిజన్‌కు బదులుగా ఆర్సెనిక్‌ను వినియోగించుకుంటాయి. ఈ బ్యాక్టీరియా రసాయన మార్పులను కలిగిస్తుంది. వరి మొక్కలను వాటి వేర్ల ద్వారా ఆర్సెనిక్‌ను సులభంగా తీసుకునేలా చేస్తుంది. నేలలో ఆక్సిజన్ తక్కువగా ఉన్నప్పుడు, ఆర్సెనిక్ మరింత చురుగ్గా మారుతుంది. ఈ మార్పు నేలలోని సూక్ష్మజీవులని కూడా ప్రభావితం చేస్తుంది, ఆర్సెనిక్‌ను ఇష్టపడే బ్యాక్టీరియా వృద్ధికి సహాయపడుతుంది’’ అని సైంటిస్టులు వివరించారు.