Tollywood: ఈ ఫోటోలో ఉన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ప్రస్తుతం స్టార్ హీరోయిన్?
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో సెలబ్రిటీలకు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు ఎక్కువగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. హీరో హీరోయిన్లు దర్శక నిర్మా
- By Anshu Published Date - 09:30 AM, Thu - 15 February 24

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో సెలబ్రిటీలకు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు ఎక్కువగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. హీరో హీరోయిన్లు దర్శక నిర్మాతలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈ ఫోటోలో ఉన్నది ఎవరో గుర్తుపట్టారా అనే క్యాప్షన్ లు జోడిస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఇది బాగా ట్రెండ్ అయిపోయింది. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా కూడా సోషల్ మీడియాలో ఒక హీరోయిన్ కి సంబంధించిన చిన్ననాటి ఫోటో వైరల్ అవుతోంది. ఆ హీరోయిన్ పేరు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది.
హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే సెకండ్ హీరోయిన్ గా అవకాశాలు వచ్చినా వదిలిపెట్టకుండా సినిమాలు చేస్తోంది. ఆ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా? చిన్నప్పుడు క్యూట్ గా ముద్దుగా ఉన్న ఈ భామ ఇప్పుడు హాట్ హాట్ అందాలతో కవ్విస్తుంది. పైన ఫోటోలో క్యూట్ గా కనిపిస్తున్న ఆ చిన్నారి మరెవరో కాదు హీరోయిన్ మీనాక్షి చౌదరి. మొదటి ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ ముద్దుగుమ్మ. మొదటి సినిమాతోనే అందంతో ఆకట్టుకుంది. అలాగే నటన పరంగానూ ప్రేక్షకులను మెప్పించింది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినప్పటి ఈ ముద్దుగుమ్మకు మంచి క్రేజ్ వచ్చింది.
ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజ నటించిన ఖిలాడీ సినిమాలు నటించి మెప్పించింది. ఈ సినిమాలో తన గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా తర్వాత హిట్ 2 సినిమాలో నటించింది ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తుంది ఈ చిన్నది. సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది మీనాక్షి చౌదరి.