Devara Success Meet : ఎన్టీఆర్ చెప్పిన ‘హరి’ ఎవరో తెలుసా..?
Devara Success Meet : ‘ముందుకు ఎప్పుడు రాడు, ఎప్పుడు వెనకాలే నిల్చుంటాడు మా హరి. చాలా మంది ఎన్నో రకాలుగా అతన్ని సరిగా అర్ధం చేసుకోరు. ఎందుకంటే అతను ముందుకు వచ్చి తన గురించి చెప్పుకోడు.
- By Sudheer Published Date - 02:12 PM, Sat - 5 October 24

దేవర సక్సెస్ మీట్ (Devara Success Meet) లో ఎన్టీఆర్ (NTR) ‘హరి’ (Hari) గురించి ప్రత్యేకంగా మాట్లాడేసరికి ఎవరా హరి..? హరి గురించి ఎందుకు ఎన్టీఆర్ ఇలా మాట్లాడాడు..? హరి కి ఎన్టీఆర్ కు సంబంధం ఏంటి..? అని అంత హరి గురించి అరా తీయడం మొదలుపెట్టారు. మరి ఆ హరి ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.
దాదాపు ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్ నుండి వచ్చిన మూవీ దేవర. ఎన్టీఆర్ – కొరటాల శివ (NTR – Koratala Shiva) కాంబినేషన్ లో భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమాను యువ సుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మించాయి. తారక్ తో జాన్వి కపూర్ జత కట్టగా సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటించారు. అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఈ మధ్యనే విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తుంది. సినిమాకు మొదటి రోజు నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ..కలెక్షన్ల విషయంలో మాత్రం టాక్ తో సంబంధం లేకుండా నిర్మాతలకు , డిస్ట్రబ్యూటర్స్ కు కాసుల వర్షం కురిపిస్తుంది.
ఈ తరుణంలో శుక్రవారం హైదరాబాద్ లోని పార్క్ హయత్ లో దేవర సక్సెస్ మీట్ ఏర్పాటు చేసారు. ఈ ఈవెంట్ కు చిత్ర యూనిట్ తో పాటు దర్శక ధీరుడు రాజమౌళి హాజరయ్యారు. ఇక ఈ ఈవెంట్ లో ఎన్టీఆర్ మాట్లాడుతూ ‘హరి ‘ గురించి చెప్పుకొచ్చాడు. ‘ముందుకు ఎప్పుడు రాడు, ఎప్పుడు వెనకాలే నిల్చుంటాడు మా హరి. చాలా మంది ఎన్నో రకాలుగా అతన్ని సరిగా అర్ధం చేసుకోరు. ఎందుకంటే అతను ముందుకు వచ్చి తన గురించి చెప్పుకోడు. ఎవరేమి అన్నా, ఎవరేమి అనుకున్నా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ కి మూల స్థంభం హరి. నాకు, కళ్యాణ్ అన్నకి మా ఇద్దరికీ స్ట్రెంత్ హరి. ఇందులో ఎటువంటి డోకా ఉండదు. నచ్చిన వాళ్ళు జీర్ణించుకుంటారు. నచ్చని వాళ్ళు జీర్ణించుకోవాల్సిన అవసరం లేదు’ అని అన్నారు. ఎన్టీఆర్ మాటలు విన్న వారంతా హరి గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు.
నిజానికి హరి ఎవరో కాదు. కళ్యాణ్ రామ్ కి స్వయానా బామ్మర్ది. కళ్యాణ్ రామ్ భార్య తమ్ముడు. ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్ వీరిద్దరూ అంటే హరి కి ఎంతో ఇష్టం. వీరిద్దరి సినిమా వ్యవహారాల మొత్తం హరినే చూసుకుంటాడు. గతంలో తారక్ మ్యానేజర్ గా పని చేసిన కోనేరు మహేష్ తో కలిసి ప్రతి పనిని దగ్గరుండి చూసుకున్నారు హరి. కోనేరు మహేష్ చనిపోయాక తారక్ వెన్నంటే వున్నారు హరి. తారక్ సినిమా పనుల పూర్తి బాధ్యతలను తన భుజాన వేసుకుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే హరి ఎన్టీఆర్ కి రామ బంటు లాంటి వారు. అందుకే ఎన్టీఆర్ కి హరి అంటే అభిమానం. అలాంటి ఇష్టమైన హరిపై ఈమధ్య కాలంలో ఎన్టీఆర్ సర్కిల్ లో చాలా బ్యాడ్ టాక్స్ వచ్చాయి. అతను వచ్చాకే ఫ్యాన్స్ కు తారక్ కు మధ్య గ్యాప్ వచ్చిందని , హరిని తీసేయాలని కొందరు ఫ్యాన్స్ ట్విట్టర్ వేదికగా పెద్ద ఎత్తున కామెంట్స్ పెట్టారు. ఇవన్నీ ఎన్టీఆర్ దృష్టికి వెళ్లడం తో..ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టాలని ..ఎన్టీఆర్ దేవర సక్సెస్ మీట్ లో హరి గురించి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. హరి అంటే ఎంత ఇష్టమో స్వయంగా ఎన్టీఆరే చెప్పడం తో అభిమానులు తమ తప్పును తెలుసుకొని సారీ చెపుతున్నారు.
Read Also : KTR Fire: ఈ ముఖ్యమంత్రికి బతుకమ్మ అంటే గిట్టదా.. పట్టదా?: కేటీఆర్