Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమాకు నో చెప్పిన సీనియర్ నటుడు.. ఎవరో తెలుసా?
- Author : Sailaja Reddy
Date : 25-02-2024 - 10:34 IST
Published By : Hashtagu Telugu Desk
టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మనందరికి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయాలలో యాక్టివ్గా పాల్గొంటున్నారు. అయితే ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో పూర్తి స్థాయిలో రాజకీయాలపై దృష్టి పెట్టారు పవన్ కళ్యాణ్. రాజకీయాల్లో బిజీగా ఉంటూనే సినిమాలను వరుసగా చేస్తున్నారు. ఆయన చేస్తోన్న సినిమాల్లో ఓజీ సినిమా కూడా ఒకటి. ఆ మూవీకి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. దానయ్య నిర్మిస్తుండగా ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది.
కాగా ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 27న గ్రాండ్‌గా విడుదల కానుంది. అయితే ఇదే తేదికి సరిగ్గా పదకొండేళ్ల క్రితం అనగా 2013 సెప్టెంబర్ 27 న పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించిన అత్తారింటికి దారేది మూవీ అతి పెద్ద విజయం అందుకుంది. ఇక అదే డేట్ కి ఓజి కూడా రిలీజ్ ఆవుతుండడంతో మరొక్కసారి బాక్సాఫీస్ వద్ద పవర్ స్టార్ హిస్టరీ రిపీట్ చేయడం ఖాయం అని అంటున్నారు పవన్ ఫ్యాన్స్. గ్యాంగ్ స్టర్ డ్రామా జానర్‌లో వస్తున్న ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ సినిమాను ఒక నటుడు రిజెక్ట్ చేశాడట.
పవన్ హీరోగా నటించిన సుస్వాగతం మూవీ విడుదల అయ్యి బంపర్ హిట్ అయ్యింది. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తండ్రి పాత్ర కోసం మొదటగా అప్పటి సీనియర్ నటుడు శోభన్ బాబుని అనుకున్నారట. అయితే ఆయన మాత్రం ఈ సినిమా ఆఫర్ రిజెక్ట్ చేశారట. దీంతో ఆ పాత్రలో రఘువరన్ నటించిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికొస్తే ఓజీ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ భగవదీయుడు భగత్ సింగ్ సినిమా, వీరమల్లు సినిమాలలో నటిస్తున్నారు. ఈ సినిమాలకు సంబంధించిన షూటింగ్ కొంతమేర జరిగే ఆగిపోయింది. ఇది ఇలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.