Deepika Remuneration: ‘ప్రాజెక్టు K’ మూవీకి దీపికా ఎన్ని కోట్లు తీసుకుంటుందో తెలుసా!
డార్లింగ్ ప్రభాస్ సరసన దీపికా పదుకొణె (Deepika Padukone) నటిస్తోంది. ఈ సినిమా కోసం భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటోంది.
- Author : Balu J
Date : 08-03-2023 - 3:05 IST
Published By : Hashtagu Telugu Desk
భారీ బడ్జెట్ పాన్ ఇండియా (Pan India Movie) మూవీలో ప్రాజెక్ట్ K ఒకటి. భారీ అంచనాలు ఉన్న సినిమాల్లో కూడా ఈ మూవీ ఉంది. ఈ సినిమాలో డార్లింగ్ ప్రభాస్ సరసన దీపికా పదుకొణె (Deepika Padukone) నటిస్తోంది. అయితే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఆమె పాత్ర కోసం దీపికకు 10 కోట్ల రూపాయలకు పైగా చెల్లించినట్లు టాలీవుడ్ టాక్. అయితే అధికారిక ధృవీకరణ లేదు. అయితే బాలీవుడ్ హీరోయిన్స్ కు బాగా డిమాండ్ ఉండటంతో 5 నుంచి 10 కోట్ల వరకు ఆఫర్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
500 కోట్ల బడ్జెట్ తో
ఈ సంవత్సరం ప్రారంభంలో దీపికా (Deepika Padukone) పుట్టినరోజున, ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ప్రాజెక్ట్ కె మూవీ దీపికా పదుకొణె కు తొలి తెలుగు చిత్రం. ఇక అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో కూడా నటిస్తున్నారు. 500 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ప్రాజెక్ట్ K విడుదల తేదీని జనవరి 14, 2024న నిర్ణయించారు. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కోలుకుంటున్న బిగ్ బీ
బాలీవుడ్ నటుడు, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) ప్రతిష్టాత్మకమైన మూవీ ప్రాజెక్టు కే షూట్ లో గాయాలైన విషయం తెలిసిందే. ఆయన కుడి పక్కటెముకకు కండరాలు చిట్టినట్టు తెలుస్తోంది. 80 ఏళ్ల స్టార్ పై యాక్షన్ షాట్ చిత్రీకరిస్తున్నప్పుడు పక్కటెముకలు కదిలి గాయాలయ్యాయి. అయితే వెంటనే వైద్య పరీక్షలు జరిపి ముంబైకు తరలించారు. ప్రస్తుతం తన నివాసంలో అమితాబ్ విశ్రాంతి తీసుకుంటున్నారు. తాజాగా ఆయన హెల్త్ అప్ డేట్ గురించి ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. మీ ప్రార్థనలు నన్ను కోలుకునేలా చేస్తున్నాయి. నా ఆరోగ్యం కోసం ప్రార్థించిన ప్రతిఒక్కరికి ధన్యావాదాలు అంటూ బిగ్ బీ రియాక్ట్ అయ్యారు.
Also Read: Murugadoss Movie: గౌతమ్ కార్తీక్ హీరోగా ఏఆర్ మురుగదాస్ నిర్మించిన ‘ఆగస్ట్ 16, 1947’