Disha Patani: దిశా పటానీ.. గ్లామర్ ట్రీట్!
హిందీ చిత్ర పరిశ్రమలో అగ్రశ్రేణి నటీమణుల్లో దిశా పటానీ ఒకరు.
- By Balu J Published Date - 01:41 PM, Mon - 30 May 22

హిందీ చిత్ర పరిశ్రమలో అగ్రశ్రేణి నటీమణుల్లో దిశా పటానీ ఒకరు. ఈ బ్యూటీ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ ను అలరిస్తోంది. ఫిట్‌నెస్, ట్రైనింగ్ వీడియోలు, బికినీ ఫొటోలతో కుర్రకారును ఆకర్షిస్తోంది. ‘బాఘీ 2’ నటి తన అద్భుతమైన చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. రెడ్ కలర్ దుస్తులతో రెచ్చిపోయిన ఈ బ్యూటీ ఫొటోలు వైరల్ గా మారాయి. అభిమానులు హాట్ హాట్ ఎమోజీలతో కామెంట్స్ చేస్తున్నారు. ఇతర హీరోయిన్ల కంటే ఈ బ్యూటీ అందాలను ప్రదర్శించడంలో ముందుంటోంది. దీంతో ఆమె ఫొటోలకు విపరీతమైన క్రేజ్ ఉంది.