Parasuram : తెలుగు హీరో నో చెప్పడంతో.. కార్తీతో తెలుగు డైరెక్టర్ సినిమా..?
ఇప్పటికే చాలా మంది తమిళ్, హిందీ హీరోలు తెలుగు దర్శకులతో సినిమాలు చేస్తున్నారు.
- Author : News Desk
Date : 24-04-2025 - 7:19 IST
Published By : Hashtagu Telugu Desk
Parasuram : ఇటీవల తమిళ హీరోలు, హిందీ హీరోలు తెలుగు దర్శకులతో సినిమాలు చేయడానికి ఇష్టపడుతున్నారు. అలా ఇప్పటికే చాలా మంది తమిళ్, హిందీ హీరోలు తెలుగు దర్శకులతో సినిమాలు చేస్తున్నారు. ఈ లిస్ట్ లో ఇప్పుడు డైరెక్టర్ పరశురామ్ చేరాడు.
యువత, సోలో, ఆంజనేయులు, శ్రీరస్తు శుభమస్తు, గీత గోవిందం, సర్కారువారి పాట.. లాంటి హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ పరశురామ్ చివరగా విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ అనే సినిమా తీసాడు. ఈ సినిమా ఫ్లాప్ గా మిగిలింది. ఈ సినిమా తర్వాత పరశురామ్ సిద్ధూ జొన్నలగడ్డతో సినిమా చేయాలి. కానీ సిద్ధూ ఇటీవలే జాక్ తో డిజాస్టర్ చూసాడు. దీంతో పరశురామ్ ని కాస్త పక్కనపెట్టాడట.
సిద్ధూ ప్రస్తుతానికి నో చెప్పడంతో పరశురామ్ తమిళ్ హీరో కార్తీకి ఓ కథ వినిపించాడట. రెంచ్ రాజు అనే టైటిల్ తో మాస్ ఎంటర్టైనర్ కథ వినిపించాడని సమాచారం. కథ నచ్చడంతో కార్తీ ఓకే చెప్పాడని కూడా తెలుస్తుంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
ఒకవేళ కార్తీ సినిమా ఓకే చేసినా ఇప్పటికే కార్తీ చేతి నిండా సినిమాలతో మరో రెండేళ్ల వరకు ఖాళీ లేడు. కాబట్టి ఒకవేళ పరశురామ్ కి కార్తీ ఓకే చెప్పినా ఈ సినిమా మొదలు అవ్వడానికి చాలానే టైం పడుతుంది అని తెలుస్తుంది. కార్తీకి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉన్న సంగతి తెలిసిందే.
Also Read : Sunitha-Pravasthi Aaradhya : సునీతను వదలని ప్రవస్తి మరో కౌంటర్ వేసేసిందిగా !