Thani Oruvan : తమిళ్ సినిమాకు సీక్వెల్ అనౌన్స్.. రామ్ చరణ్, నయనతార చేస్తారా?
గతంలో తని ఒరువన్ సినిమాకు సీక్వెల్ తెస్తారని వార్తలు వచ్చాయి.
- By News Desk Published Date - 11:29 AM, Mon - 19 May 25

Thani Oruvan : డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వంలో రవి మోహన్, నయనతార జంటగా తెరకెక్కిన సినిమా తని ఒరువన్. 2015 లో ఈ సినిమా రిలీజయి పెద్ద హిట్ అయింది. ఈ సినిమాని తెలుగులో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్, రకుల్ ప్రీత్ జంటగా ధ్రువ టైటిల్ తో తెరకెక్కించగా ఇక్కడ కూడా హిట్ అయింది. అయితే గతంలో తని ఒరువన్ సినిమాకు సీక్వెల్ తెస్తారని వార్తలు వచ్చాయి.
తాజాగా ఓ సినిమా ఈవెంట్ కి తని ఒరువన్ డైరెక్టర్ మోహన్ రాజా, నిర్మాత అర్చన కల్పాతి రాగా ఈ సినిమా సీక్వెల్ గురించి టాపిక్ వచ్చింది. దీంతో డైరెక్టర్ మోహన్ రాజా.. తని ఒరువన్ సినిమా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు థ్యాంక్స్. ఈ సినిమాకు సీక్వెల్ కచ్చితంగా ఉంటుంది అని మరోసారి క్లారిటీ ఇచ్చాడు.
ఇక నిర్మాత అర్చన మాట్లాడుతూ.. తని ఒరువన్ నా లైఫ్ లో స్పెషల్ సినిమా. నేను అవార్డు అందుకున్న మొదటి సినిమా. మోహన్ రాజా ఇప్పటికే తని ఒరువన్ సీక్వెల్ కి ఒక అదిరిపోయే లైన్ చెప్పాడు. తని ఒరువన్ కంటే భారీగా సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాము. దానికి ఇంకా సమయం పడుతుంది. రవి మోహన్, నయనతార డేట్స్ దొరకాలి అని తెలిపింది. దీంతో తని ఒరువన్ సీక్వెల్ అయితే ఉంటుందని క్లారిటీ వచ్చేసింది.
అయితే నయనతార ఇప్పుడు కేవలం లేడీ ఓరియెంటెడ్ సినిమాలు, లేదా స్టార్ హీరోల సినిమాలు మాత్రమే చేస్తుంది. ఇలాంటి సమయంలో రవి మోహన్ పక్కన నయనతార హీరోయిన్ గా సినిమా చేస్తుందా అంటే సందేహమే అని చెప్పొచ్చు. అసలే గత కొన్నాళ్లుగా రవి మోహన్ విడాకుల వివాదంలో ఉన్నాడు. ఇక తమిళ్ లో ఈ సీక్వెల్ తీస్తే దాన్ని మళ్ళీ రామ్ చరణ్ రీమేక్ చేస్తాడా కూడా డౌట్ అనే చెప్పాలి. ఇప్పుడు ఉన్న పాన్ ఇండియా మార్కెట్ లో రీమేక్స్ వర్కౌట్ అవ్వవు. తమిళ్ లో తీస్తే దాన్నే డబ్బింగ్ చేసి తెలుగులో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రామ్ చరణ్ కూడా ధ్రువ సీక్వెల్ తీయకపోవచ్చు అని అంటున్నారు.