HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Director Maruthi Interesting Comments On Prabhas Rajasaab Movie

Director Maruthi: రాజాసాబ్ మూవీతో నేనంటే ఏంటో చూపిస్తాను.. డైరెక్టర్ మారుతీ కామెంట్స్ వైరల్?

టాలీవుడ్ దర్శకుడు మారుతి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ రోజుల్లో, బస్ స్టాప్ ఇలాంటి చిన్న చిన్న సినిమాలతో కెరీర్ ను మొదలుపెట్టిన దర

  • Author : Anshu Date : 05-02-2024 - 10:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mixcollage 05 Feb 2024 08 05 Am 6691
Mixcollage 05 Feb 2024 08 05 Am 6691

టాలీవుడ్ దర్శకుడు మారుతి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ రోజుల్లో, బస్ స్టాప్ ఇలాంటి చిన్న చిన్న సినిమాలతో కెరీర్ ను మొదలుపెట్టిన దర్శకుడు మారుతి డైరెక్టర్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు. ఒకవైపు దర్శకుడుగా సినిమాలను తెరకెక్కిస్తూనే మరొకవైపు చిన్న, మంచి సినిమాలని ప్రోత్సహిస్తూ నిర్మాతగా, ప్రజెంటర్ గా కూడా ఉంటున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ మారుతి రెబల్ స్టార్ ప్రభాస్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టుని ఏ ముహూర్తాన అనౌన్స్ చేశారు కానీ అప్పటినుంచి డైరెక్టర్ మారుతి పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది.

అంతేకాకుండా రాజాసాబ్ సినిమా నుంచి ప్రభాస్ కి సంబంధించిన ఒక మాస్ లుక్ కి సంబంధించిన పోస్టర్ షేర్ చేయడంతో ఈ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి. ఇంతకుముందు ఏ సినిమాలో లేని విధంగా ప్రభాస్ ఇందులో ఒక మాస్ క్యారెక్టర్ లో కనిపించనున్నారు. పోస్టర్ లో ప్రభాస్ లుంగీ కట్టుకొని  ఫుల్ మాస్ గా కనిపించిన విషయం తెలిసిందే. ఇటీవలే ప్రభాస్ సినిమాకు రాజాసాబ్ అనే టైటిల్ ప్రకటించారు. రాజాసాబ్ సినిమా ఈ సంవత్సరం చివర్లో లేదా, వచ్చే సంవత్సరం సంక్రాంతికి వస్తుందని సమాచారం. అయితే ఇటీవల రాజాసాబ్ సినిమా నుంచి నెలకొక అప్డేట్ ఇస్తామని మారుతి అన్నారు. తాజాగా ట్రూ లవర్ అనే సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మారుతీ సినిమా గురించి మాట్లాడిన తర్వాత ప్రభాస్ అభిమానులు రాజాసాబ్ గురించి అడగడంతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ మారుతీ రాజాసాబ్ గురించి మాట్లాడుతూ.. ఆ సినిమా గురించి నేను మాటల్లో చెప్పలేను. చేతల్లో చూపించాల్సిందే. కచ్చితంగా నేనేంటో ఈ సినిమాతో మీరు చూస్తారు. ప్రతి నెల ఒక అప్డేట్ ఇస్తాను అని చెప్పాము. అప్డేట్ కదా అని చెప్పి ఏది పడితే అది ఇవ్వలేము. ఒకవేళ ఏమన్నా ఇస్తే.. ఇది కూడా ఒక అప్డేటా అంటారు మళ్ళీ. త్వరలోనే ఒక మంచి అప్డేట్ అయితే ఒకటి ఇస్తాము. కొంచెం వెయిట్ చేయండి. ఫ్యాన్స్ సోషల్ మీడియాలో నాకు మెసేజ్ లు చేస్తున్నారు. మీకు నచ్చే విధంగానే మీరు అనుకున్న దానికంటే పది శాతం ఎక్కువే ఉండే అప్డేట్ తో వస్తాను అని అన్నారు. దీన్ని బట్టి చూస్తుంటే ఈ సినిమాను కొంచెం జాగ్రత్తగా ప్రభాస్ అభిమానులకు నచ్చే విధంగా రూపొందిస్తున్నట్లు అర్థమవుతోంది. మరి ఈనెల మారుతీ ఎలాంటి అప్డేట్ విడుదల చేస్తాడా అనే ప్రభాస్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Director Maruthi
  • Interesting Comments
  • prabhas
  • rajasaab movie
  • tollywood

Related News

As for Samantha, the gem of our family, she is doing...

Maa Inti Bangaram: సమంత మా ఇంటి బంగారం ఎలా ఉందంటే..

టాలీవుడ్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ అయిన సమంత, దర్శకురాలు నందినీ రెడ్డి కలయికలో రూపొందిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే అమెరికాతో పాటు పలు ప్రాంతాల్లో ఈ సినిమా ప్రీమియర్ షోలు ప్రదర్శితమవడంతో, సోషల్ మీడియా వేదికగా ఫస్ట్ టాక్ బయటకు వచ్చేసింది. ఈ చిత్రంలో సమంత తన అద్భుతమైన నటనతో మరోసారి వెండితెరపై మాయ చేసిందని ప

  • Legal notices served to actor Vijay Deverakonda.

    Breaking News: హీరో విజయ్‌ దేవరకొండకు లీగల్‌ నోటీసులు

  • Allu Arjun's 'Raka' – When is the release date?

    RAAKA: అల్లు అర్జున్ ‘రాకా’.. రిలీజ్ డేట్‌ ఎప్పుడంటే?

Latest News

  • Jnaneswari: చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో ఎన్నో కొత్త మలుపు.?

  • Wedding : జర్మనీలో మొదలైన ప్రేమ.. పల్నాడులో పెళ్లి పీటలు

  • Happy Fathers Day: నాన్నకు ప్రేమతో…

  • ఈ గొప్పల దండకం ఇక చాలు.. కేటీఆర్, బీఆర్ఎస్‌లు ఈ వాస్తవాలు తనిఖీ చేసుకోవాలి !

  • Bandi Bhagirath: బండి భగీరథ్‌కు కండీషనల్ బెయిల్…

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd