DilRaju: ఇంకొకరు అయితే సూసైడ్ చేసుకునేవారు.. దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు!
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఎప్పుడూ ఏదోక వివాదంలో ఉంటున్నారు. సినిమా ధియేటర్లను తమ గుప్పిట్లో ఉంచుకుని ఇతర సినిమాలకు ఇవ్వడం లేదనే విమర్శలు ఎప్పటినుంచో ఉన్నవే.
- By Nakshatra Published Date - 10:31 PM, Thu - 29 December 22
DilRaju: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఎప్పుడూ ఏదోక వివాదంలో ఉంటున్నారు. సినిమా ధియేటర్లను తమ గుప్పిట్లో ఉంచుకుని ఇతర సినిమాలకు ఇవ్వడం లేదనే విమర్శలు ఎప్పటినుంచో ఉన్నవే. ఇక సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లు, ఇతర సినిమా వేదికల మీద ఆయన కాంట్రవర్షియల్ వ్యాఖ్యలు చేస్తోన్నారు. ఒకప్పుడు దిల్ రాజు సినిమా ఫంక్షన్లలో అంతగా మాట్లాడావాళ్లు కాదు. ఏదో సినిమా గురించి మాత్రమే మాట్లాడి వెళ్లిపోయేవారు.
అయితే ఇటీవల ప్రతీ ఫంక్షన్ లోనూ దిల్ రాజు ఏవోక వివాదాస్పనద వ్యాఖ్యలు చేస్తోన్నారు. తాజగా మరోసారి దిల్ రాజు మరో వివాదంలో చిక్కుకున్నారు. సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలకు పోటీగా డబ్బింగ్ సినిమా అయిన వారసుడు సినిమాను ఆయన రిలీజ్ చేయనుండటంపై విమర్శలు వస్తోన్నాయి. సంక్రాంతికి నటసింహం నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తు్న వాల్లేరు వీరయ్య సినిమాలు బాక్సాఫీస్ వద్దకు రానున్నాయి. దీనికి పోటీగా డబ్బింగ్ సినిమా అయిన వారసుడు సినిమాను దిల్ రాజు తీసుకురానుండటంతో.. తెలుగు సినిమాలకు నష్టం వాటిల్లే ప్రమాదముందని అంటున్నారు.
ఈ వివాదంపై దిల్ రాజు స్పందించాడు. తాను చేసేది వ్యాపారం అని, అందుకే తన వైఖరి మార్చుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపారు. వారసుడు విషయంలో అనవసర రాద్దాంతం జరుగుతన్నట్లు తన దృష్టికి వచ్చిందని, తాను నచ్చితే ఎంత దూరం అయినా వెళతానని అన్నారు. అజ్ఞాతవాసి, స్పైడర్ చిత్రాల వల్ల డిస్ట్రిబ్యూటర్ గా చాలా నష్టపోయాని, ఆ రెండు సినిమాల వల్ల ఆర్ధికంగా బాగా దెబ్బ తగిలిందని చెప్పారు.
ఇంకోకరు అయితే ఆత్మహత్య చేసుకునేవాళ్లని, ఇండస్ట్రీ నుంచి పారిపోచేవారని దిల్ రాజు చెప్పారు. తాను కాబట్టి తట్టుకుని నిలబడ్డానని దిల్ రాజు చెప్పారు. వారసుడి విషయంలో ఎందుకు వివాదం జరుగుతుంతో తనకు తెలియదని, మూడు సినిమాలు బాగుంటే మూడింటికి కలెక్షన్లు వస్తాయన్నారు.
Related News
Vijay Devarakonda Sai Pallavi : విజయ్ దేవరకొండతో సాయి పల్లవి.. ఓకే అనాలంటే మాత్రం ఆ కండీషన్ తప్పనిసరి..!
Vijay Devarakonda Sai Pallavi కత్తి నేనే.. నెత్తురు నాదే.. యుద్ధం నాతోనే అంటూ విజయ్ దేవరకఒండ నెక్స్ట్ సినిమా పోస్టర్ తోనే వారెవా అనిపించేశాడు. రవి కిరణ్ కోలా డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మిస్తున్న