Ram Charan : ఈ స్టార్స్ అందరూ.. ఒక యాక్టింగ్ స్కూల్ లోనే ట్రైన్ అయ్యారు!
రామ్ చరణ్ ప్రస్తుతం టాలీవుడ్ మెయిన్ హీరోల్లో ఒకడు. ఇండస్ట్రీలో అత్యధిక క్రౌడ్ పుల్లర్‌లలో ఒకడు కూడా. ‘మ్యాన్ ఆఫ్ మాస్’గా పేరుంది. ‘చిరుత’తో ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ ‘మగధీర, ధ్రువ, రంగస్థలం’ వంటి బ్లాక్ బస్టర్‌లను అందించాడు.
- By Balu J Published Date - 12:43 PM, Wed - 17 November 21
రామ్ చరణ్ ప్రస్తుతం టాలీవుడ్ మెయిన్ హీరోల్లో ఒకడు. ఇండస్ట్రీలో అత్యధిక క్రౌడ్ పుల్లర్‌లలో ఒకడు కూడా. ‘మ్యాన్ ఆఫ్ మాస్’గా పేరుంది. ‘చిరుత’తో ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ ‘మగధీర, ధ్రువ, రంగస్థలం’ వంటి బ్లాక్ బస్టర్‌లను అందించాడు. ఒకవైపు కమర్షియల్ అంశాలకు ప్రాధాన్యమిస్తూనే.. సామాజిక అంశాలు ఉండేలా సినిమాలు తీస్తున్నారు. కథల వైవిధ్యంలో చరణ్ ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతున్నందునే వరుస విజయాలు దక్కించుకుంటున్నాడు.
మెగాస్టార్ చిరంజీవి కుమారుడు అయినప్పటికీ, రామ్ చరణ్ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించే ముందు యాక్టింగ్ లో ట్రైనింగ్ తీసుకోవలసి వచ్చింది. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, ప్రియాంక చోప్రా, కరీనా కపూర్ శిక్షణ పొందిన యాక్టింగ్ స్కూల్ లోనే రాంచరణ్ కూడా నటన మెళకువలు తెలుసుకున్నారు. యాక్టింగ్ స్కిల్స్ మెరుగుపరుచుకోవడానికి రామ్ చరణ్ ముంబైలోని ప్రసిద్ధ నమిత్ కపూర్ యాక్టింగ్ స్కూల్‌లో చేరాడు. చాలామంది ప్రముఖ నటీనటులు అక్కడ యాక్టింగ్ నేర్చుకొని పెద్ద స్టార్స్ గా మారారు. ఇండస్ట్రీకి మంచి నటులను అందించిన ఈ యాక్టింగ్ స్కూల్ దేశానికే గర్వకారణమని చెప్పక తప్పదు.
రామ్ చరణ్ ఈ సంవత్సరం రౌద్రం రణం రుధిరం (RRR,) ఆచార్య అనే రెండు భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ చిత్రాల్లో నటిస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ రెండు చిత్రాలతో రామ్ చరణ్ బిజీగా మారారు. RRRలో, రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు అల్లూరి సీతారామ రాజు పాత్రలో కనిపిస్తాడు ఆచార్య తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో సిద్ధ పాత్రలో కనిపిస్తాడు.
Related News
Tovino Thomas : టాలీవుడ్ పై మలయాళం హీరో కౌంటర్.. తెలుగు మల్టీస్టారర్ చేస్తే మలయాళంలో నా కెరీర్ ఎండ్ అయిపోతుంది..
తాజాగా మలయాళం హీరో టోవినో థామస్ ఇండైరెక్ట్ గా టాలీవుడ్ వాళ్లకు కౌంటర్ వేసాడు.