HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Dharmendra Is Stable Recovering Esha Deol Rejects False News On Actor

Dharmendra: న‌టుడు ధ‌ర్మేంద్ర మృతి వార్త‌ల‌ను ఖండించిన కూతురు!

దీనికి ఒక రోజు ముందు ధర్మేంద్ర కుమారుడు సన్నీ డియోల్ కూడా మీడియాలో వస్తున్న ఊహాగానాలను కొట్టిపారేశారు. తన తండ్రిని వెంటిలేటర్‌పై ఉంచారనే వార్తలు పూర్తిగా అవాస్తవమని ఆయన ప్రతినిధి ద్వారా సోమవారం ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు.

  • By Gopichand Published Date - 10:09 AM, Tue - 11 November 25
  • daily-hunt
Dharmendra
Dharmendra

Dharmendra: బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర ఆరోగ్యం గురించి అభిమానులు ఆందోళన చెందుతున్న వేళ ఆయన కుటుంబం ఊరటనిచ్చే ప్రకటన విడుదల చేసింది. దక్షిణ ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ధర్మేంద్ర (Dharmendra) ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయన త్వరగా కోలుకుంటున్నారని కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు.

మరణ వార్తలు అవాస్తవం.. ఈషా డియోల్ స్పష్టం

నటుడి కూతురు, నటి ఈషా డియోల్ మంగళవారం (నవంబర్ 11) ఉదయం 9 గంటలకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈ శుభవార్తను పంచుకున్నారు. ఈ సందర్భంగా మీడియాలో వస్తున్న తన తండ్రి మరణ వార్తలను ఆమె ఖండించారు.

Our media is so dumbOur country's media has become so useless that because of the fake news they spread, even Dharmendra ji’s daughter had to come forward to give clarification.#Dharmendra#DharmendraDeol pic.twitter.com/RecEQFedEX

— Kavya✨ (@Lekhika99) November 11, 2025

ఈషా తన పోస్ట్‌లో ఇలా పేర్కొన్నారు. “మీడియా అత్యుత్సాహంలో ఉంది. తప్పుడు వార్తలను వ్యాపిస్తున్నట్లు అనిపిస్తోంది. మా నాన్నగారి ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయన కోలుకుంటున్నారు. మా కుటుంబానికి గోప్యత ఇవ్వాలని మేమందరం అభ్యర్థిస్తున్నాము. నాన్న త్వరగా కోలుకోవాలని ప్రార్థించినందుకు ధన్యవాదాలు” అని రాసుకొచ్చింది. ఆమె అభిమానులు, సినీ ప్రపంచం వ్యక్తం చేసిన అపారమైన ప్రేమ, ఆందోళనకు కృతజ్ఞతలు తెలిపారు.

Also Read: Red Fort Blast: ఎర్ర‌కోట స‌మీపంలో భారీ పేలుడు.. కేంద్రం కీల‌క నిర్ణ‌యం!

వెంటిలేటర్‌పై లేరు.. సన్నీ డియోల్ వివరణ

దీనికి ఒక రోజు ముందు ధర్మేంద్ర కుమారుడు సన్నీ డియోల్ కూడా మీడియాలో వస్తున్న ఊహాగానాలను కొట్టిపారేశారు. తన తండ్రిని వెంటిలేటర్‌పై ఉంచారనే వార్తలు పూర్తిగా అవాస్తవమని ఆయన ప్రతినిధి ద్వారా సోమవారం ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. సన్నీ డియోల్ బృందం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ధర్మేంద్ర గారి ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయన జాగ్రత్తగా వైద్య పర్యవేక్షణలో ఉన్నారు. అభిమానులు ఈ కష్ట సమయంలో కుటుంబ గోప్యతను గౌరవిస్తూ, ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించాలని అభ్యర్థించారు. దేశవ్యాప్తంగా ఉన్న ధర్మేంద్ర అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుతూ సోషల్ మీడియాలో సందేశాలు పంపుతున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bollywood
  • Cinema News
  • Dharmendra
  • Esha Deol
  • False News
  • Sholay Actor

Related News

    Latest News

    • IND vs SA: న‌వంబ‌ర్ 14 నుంచి భార‌త్- సౌతాఫ్రికా తొలి టెస్ట్‌.. మ్యాచ్‌కు వర్షం అంతరాయం?!

    • Gold Prices: మ‌ళ్లీ పెరిగిన ధ‌ర‌లు.. బంగారం కొనుగోలు చేయ‌టానికి ఇదే స‌రైన స‌మ‌యమా?

    • Dharmendra: న‌టుడు ధ‌ర్మేంద్ర మృతి వార్త‌ల‌ను ఖండించిన కూతురు!

    • IPL 2026 Auction: ఈసారి ఐపీఎల్ 2026 వేలం ఎక్క‌డో తెలుసా?

    • Red Fort Blast: ఎర్ర‌కోట స‌మీపంలో భారీ పేలుడు.. కేంద్రం కీల‌క నిర్ణ‌యం!

    Trending News

      • IPL Trade: ఐపీఎల్‌లో అతిపెద్ద ట్రేడ్.. రాజ‌స్థాన్ నుంచి సంజూ, చెన్నై నుంచి జ‌డేజా!

      • Akash Choudhary: విధ్వంసం.. 11 బంతుల్లోనే అర్ధ సెంచరీ!

      • Digital Gold: డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెడుతున్నారా? మీకొక షాకింగ్ న్యూస్‌!

      • IND vs AUS: భార‌త్‌- ఆస్ట్రేలియా మ్యాచ్ ర‌ద్దు కావ‌డానికి కార‌ణం పిడుగులేనా?

      • Strong Room: ఎన్నిక‌ల త‌ర్వాత ఈవీఎంల‌ను స్ట్రాంగ్ రూమ్‌లో ఎందుకు ఉంచుతారు?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd