D50: ధనుష్ 50వ సినిమా టైటిల్ ఫిక్స్.. ఫస్ట్ లుక్ పోస్టర్ మామూలుగా లేదుగా?
- Author : Sailaja Reddy
Date : 20-02-2024 - 11:00 IST
Published By : Hashtagu Telugu Desk
తెలుగు సినీ ప్రేక్షకులకు తమిళ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తమిళం తో పాటు తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్నారు ధనుష్. సినిమా హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు. ఆయన నటించిన కొన్ని తమిళ సినిమాలు తెలుగులోకి విడుదల అయిన విషయం తెలిసిందే. కమర్షియల్ చిత్రాలతో పాటు కొత్త తరహా సినిమాలు చేయడంలో ఆయన ముందుంటారు. తాజాగా తన స్వీయ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నారు. ధనుష్ కెరీర్‌లో 50వ సినిమాగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది.
అయితే తాజాగా ఈ సినిమాకి రాయన్ అనే టైటిల్ ను ఖరారు చేసారు. ఇదే విషయాన్ని తెలుపుతూ ధనుష్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో ధనుష్ ఒక ఫుడ్ ట్రక్ ముందు నిలబడి ఉన్నాడు. అతను క్లోజ్డ్-క్రాప్డ్ లుక్, మీసాలతో ఉన్నాడు. ఎరుపు రంగు చొక్కా ధరించాడు. దానిపై ఆప్రాన్ ఉంది. ఆ ఆఫ్రాన్ మొత్తం రక్తం మరకలతో కనిపిస్తోంది. చేతిలో ఒక రకమైన ఆయుధాన్ని పట్టుకున్నాడు. వెనుక ట్రక్‌లో సందీప్ కిషన్‌తో పాటు మరో నటుడు ఉన్నాడు. మొత్తంగా ఈ ఫస్ట్‌లుక్ ఆకట్టుకుంటోంది.
#D50 is #Raayan 🔥
🎬 Written & Directed by @dhanushkraja
🎵 Music by @arrahmanReleasing in Tamil | Telugu | Hindi@omdop @editor_prasanna @kalidas700 @sundeepkishan @PeterHeinOffl @jacki_art @kavya_sriram @kabilanchelliah @theSreyas @RIAZtheboss #D50FirstLook pic.twitter.com/vfemOIRKIX
— Sun Pictures (@sunpictures) February 19, 2024
ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. కాగా ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబందించిన షూటింగ్ జరుగుతోంది. మరీ ఈ మూవీతో హీరో ధనుష్ ఏ మేరకు సక్సెస్ ను అందుకుంటారో చూడాలి మారి.