Dhanush Raayan : కమల్ ఆగిపోతే ధనుష్ రంగంలోకి దిగుతున్నాడా..?
Dhanush Raayan లోకనాయకుడు కమల్ హాసన్ లీడ్ రోల్ లో సూపర్ హిట్ మూవీ ఇండియన్ సినిమాకు సీక్వెల్ గా ఇండియన్ 2 వస్తున్న విషయం తెలిసిందే. ఓ పక్క చరణ్ తో గేమ్ చేంజర్ చేస్తూనే
- Author : Ramesh
Date : 07-05-2024 - 9:28 IST
Published By : Hashtagu Telugu Desk
Dhanush Raayan లోకనాయకుడు కమల్ హాసన్ లీడ్ రోల్ లో సూపర్ హిట్ మూవీ ఇండియన్ సినిమాకు సీక్వెల్ గా ఇండియన్ 2 వస్తున్న విషయం తెలిసిందే. ఓ పక్క చరణ్ తో గేమ్ చేంజర్ చేస్తూనే ఇండియన్ 2 సినిమా కూడా పూర్తి చేస్తున్నాడు శంకర్. అయితే ఇండియన్ 2 సినిమాను జూన్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చ్శారు. జూన్ 13న సినిమా రిలీజ్ అనుకున్నారు. కానీ సినిమా రిలీజ్ వాయిదా వేశారు. జూన్ నుంచి జూలై లేదా ఆగష్టుకి ఇండియన్ 2 పోస్ట్ పోన్ అయినట్టు తెలుస్తుంది.
ఇండియన్ 2 సినిమా జూన్ 13 నుంచి వాయిదా పడగా ఆ డేట్ కి ధనుష్ రాయన్ ని లాక్ చేశారు. ధనుష్ నటిస్తూ డైరెక్ట్ చేస్తున్న సినిమా రాయన్. సినిమా నుంచి రీసెంట్ గా వచ్చిన ఫస్ట్ లుక్ ఫ్యాన్స్ ని మెప్పించింది. రాయన్ సినిమాను జూన్ 13న రిలీజ్ లాక్ చేశారు. సన్ పిక్చర్స్ బ్యానర్ తెరకెక్కుతున్న ఈ సినిమాలో సందీప్ కిషన్ కూడా నటిస్తున్నాడు.
కమల్ ఆగిపోతే ఆ ప్లేస్ లో ధనుష్ రంగంలోకి దిగుతున్నాడు. మరోపక్క ధనుష్ శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో కుబేర సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తో మరోసారి తన వర్సటాలిటీ చాటిచెప్పనున్నాడు ధనుష్. కుబేర సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో కింగ్ నాగార్జున కూడా స్పెషల్ రోల్ చేస్తున్నారని తెలిసిందే.
Also Read : NTR Hrithik Roshan : వార్ 2 ఎన్టీఆర్, హృతిక్ సాంగ్ కొరియోగ్రాఫర్ ఎవరో తెలుసా..?