Dhanush : నయనతార పై ధనుష్ కేసు ఫైల్..
Dhanush : నయనతార డాక్యుమెంటరీలో తన అనుమతి లేకుండా 'నేనూ రౌడీనే' అనే సినిమా విజువల్స్ వాడుకోవడంతో ధనుష్ తాజాగా మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు
- By Sudheer Published Date - 04:24 PM, Wed - 27 November 24

నయనతార – ధనుష్ ల మధ్య వివాదం ఇప్పట్లో సర్దుమణిగేలే కనిపించడం లేదు. తాజాగా నయనతార దంపతులపై ధనుష్ కోర్ట్ లో పిర్యాదు చేసాడు. నయనతార, హీరో ధనుష్ మధ్య వివాదం (Controversy between Nayanthara and hero Dhanush) గత కొద్దీ రోజులుగా ఫిలిం ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది. నయనతార తన జీవితంపై ఓ డాక్యుమెంటరీ రూపొందించింది. ‘నయనతార- బియాండ్ ది ఫెయిరీ టేల్’ పేరుతో రూపొందించిన ఈ డాక్యుమెంటరీలో ఇండస్ట్రీలో తన ప్రయాణం, విఘ్నేశ్ శివన్ తో తన ప్రేమ, పెళ్లి తదితర వివరాలన్నీ చూపించే ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగా తామిద్దరి పరిచయం, ప్రేమకు దారితీసిన సినిమా ‘నానుం రౌడీ ధాన్’ లో ఓ చిన్న సన్నివేశాన్ని తన డాక్యుమెంటరీలో ఉపయోగించుకుంది.
సినిమాలో నుంచి చిన్న క్లిప్ ను వాడుకోవడానికి ఆ సినిమాను నిర్మించిన ధనుష్ అనుమతి కోసం చాలా ప్రయత్నించింది. అయితే, ధనుష్ మాత్రం ఎటూ తేల్చకుండా, నయనతారకు ఎలాంటి జవాబివ్వకుండా మౌనంగా ఉండిపోయాడు. తీరా ఇటీవల నయనతార తన డాక్యుమెంటరీ ట్రైలర్ రిలీజ్ చేశాక ధనుష్ రూ.10 కోట్లు చెల్లించాలని నోటీసులు పంపాడు. దీంతో ధనుష్ పై నయన్ ఏకంగా మూడు పేజీల లేఖ రాస్తూ పలు విమర్శలు చేసింది.
నయనతార డాక్యుమెంటరీలో తన అనుమతి లేకుండా ‘నేనూ రౌడీనే’ అనే సినిమా విజువల్స్ వాడుకోవడంతో ధనుష్ తాజాగా మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. దాంతో నయనతార దంపతులపై సివిల్ కేసు దాఖలైంది. ఈ వ్యవహారంలో ఇండస్ట్రీలోని పలువురు హీరోయిన్లు , ప్రముఖులు నయన్ కు మద్దతు పలుకుతున్నారు.
Read Also : Sajjala Bhargav Reddy: సజ్జల భార్గవ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ల విచారణ ఈ నెల 29కి వాయిదా!