Devara Team Chit Chat : దేవర కోసం రంగంలోకి దిగిన యంగ్ హీరోస్
Devara Team Chit Chat : ఇంటర్వ్యూ మొత్తం కూడా చాల ఫన్నీ గా సాగుతుందని, ఇంటర్వ్యూలో సిద్దు, సేన్ లు పోటీ పడి మరీ ఎన్టీఆర్ ను సరదాగా ఇరుకున పెట్టే విధంగా ప్రశ్నలు అడిగారని, వాటికి ఎన్టీఆర్ తనదైన శైలిలో చాలా తెలివిగా సమాధానాలు చెప్పాడని తెలుస్తోంది
- Author : Sudheer
Date : 13-09-2024 - 11:43 IST
Published By : Hashtagu Telugu Desk
Devara Team Chit Chat With Vishwak Sen & Siddhu Jonnalagadda : దేవర చిత్రం రిలీజ్ కు దగ్గర పడుతుండడంతో యంగ్ హీరోలు రంగంలోకి దిగారు. ఎన్టీఆర్ అంటే ఎంతో అభిమానించే హీరోలు ..స్వయంగా తమ అభిమాన హీరోతో చిట్ చాట్ చేసి అభిమానులను అలరించబోతున్నారు. ఎన్టీఆర్ (NTR), RRR తర్వాత గ్యాప్ తీసుకొని దేవర (Devara) సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. మాస్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో ఈ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. సినిమా విడుదలకు కొద్దీ రోజుల సమయమే మాత్రమే ఉండటంతో మేకర్స్ ప్రమోషన్స్ లో స్పీడును పెంచారు.
ఇప్పటికే మూడు పాటలను విడుదల చేసి సినిమా ఫై అంచనాలు పెంచేసిన మేకర్స్.. రీసెంట్ గా ట్రైలర్‌ను గ్రాండ్‌గా విడుదల చేశారు. ఈ ట్రైలర్ రిలీజైన 24 గంటల్లోనే అన్ని భాషల్లో కలిపి 55 మిలియన్ల వ్యూస్ వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతోపాటు యూట్యూబ్లో ట్రైలర్ ట్రెండ్ అవుతోందని తెలిపారు. కాగా, ఇది ఆల్ టైమ్ రికార్డ్ అని, ఓ ట్రైలర్ కు ఇన్ని వ్యూస్ రావడం ఇదే తొలిసారని సినీవర్గాలు చెబుతున్నాయి.
ఇదిలా ఉంటె తాజాగా డీజే టిల్లు సిద్దు (Sidhu Jonnalagadda) , మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) లు యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) తో చిట్ చాట్ (Chit Chat) చేసారు. ఈ చిట్ చాట్ లో ఎన్టీఆర్ (Jr NTR) తో పాటు డైరెక్టర్ కొరటాల శివ కూడా ఉన్నారు. ఈ వీడియో ని రేపు యూట్యూబ్ లో రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఈ చాట్ చాట్ కోసం ఇద్దరు హీరోలు గట్టిగానే ప్రిపేర్ అయ్యారట. ఇప్పటి వరకు ఎన్టీఆర్ నుంచి రాబట్టలేని కొన్ని ప్రశ్నల సమాధానాలను వారు ఈ ఇంటర్వ్యూలో రాబట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇంటర్వ్యూ మొత్తం కూడా చాల ఫన్నీ గా సాగుతుందని, ఇంటర్వ్యూలో సిద్దు, సేన్ లు పోటీ పడి మరీ ఎన్టీఆర్ ను సరదాగా ఇరుకున పెట్టే విధంగా ప్రశ్నలు అడిగారని, వాటికి ఎన్టీఆర్ తనదైన శైలిలో చాలా తెలివిగా సమాధానాలు చెప్పాడని తెలుస్తోంది. మొత్తానికి ఇంటర్వ్యూ కోసం ఎన్టీఆర్ అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇక విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నలగడ్డ పక్కా నందమూరి ఫాన్స్ అనే సంగతి తెలిసిందే. వీళ్ళిద్దరూ నటించిన పలు సినిమాలని ఎన్టీఆర్ (NTR), బాలకృష్ణ (Balakrishna) పలుమార్లు ప్రమోట్ కూడా చేసారు. అంతే ఎందుకు నిన్నటికి నిన్న విజయవాడ వరద బాధితులకు సాయం అందించేందుకు స్వయంగా బాలకృష్ణ తో కలిసి ఈ ఇద్దరు వెళ్లి..సీఎం చంద్రబాబు ను కలిసి చెక్ లను అందజేశారు.
Read Also : HYDRA : హైడ్రాను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటీషన్…