David Warner: నితిన్ సినిమాలో నటించినందుకు డేవిడ్ వార్నర్ ఎంత రెమ్యూనరేషన్ అందుకున్నారో తెలుసా?
ప్రముఖ ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ నితిన్ సినిమాలో నటించినందుకు గాను ఎంత రెమ్యూనరేషన్ అందుకున్నాడు అన్న వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
- By Anshu Published Date - 01:03 PM, Thu - 6 March 25

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ అయిన డేవిడ్ వార్నర్ గురించి మనందరికీ తెలిసిందే. ఆయన కేవలం ఆటగాడు మాత్రమే కాదండోయ్ మంచి నటుడు కూడా. క్రికెట్ లో తన ఆటతీరుతో ఎంతోమందిని మెప్పించిన విషయం తెలిసిందే. కానీ డేవిడ్ వార్నర్ కి యాక్టింగ్ అంటే బాగా పిచ్చి. గతంలో లాక్డౌన్ సమయంలో వీడియోలు చేసి ప్రేక్షకులను బాగా అలరించారు. అల్లు అర్జున్, ప్రభాస్, మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ హీరోల పాటలకు స్టైప్పులు వేసి దక్షిణాది సీనీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు.
ఇక ఇప్పుడు ఏకంగా ఒక తెలుగు సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. నితిన్, శ్రీలీల జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం రాబిన్‌హుడ్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో డేవిడ్ వార్నర్ కీలక పాత్ర పోషించాడట. ఈ విషయాన్ని ఇన్నాళ్లు గోప్యంగా ఉంచిన మేకర్స్ తాజాగా ఒక ఈవెంట్ లో ఈ విషయాన్ని వెల్లడించారు. డేవిడ్ వార్నర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారనే విషయం తెలియగానే అటు క్రికెట్ అభిమానులతో పాటు ఇటు సీనీ లవర్స్ కూడా రాబిన్‌హుడ్ సినిమాలో ఆయన పాత్ర ఎలా ఉంటుంది? అసలు ఆ పాత్రలో నటించడానికి వార్నర్ ఎంత తీసుకున్నాడు? అనే విషయాల పై ఆరా తీస్తున్నారు.
కాగా ఈ సినిమాలో నటించినందుకు గాను వార్నర్ కి రూ.50 లక్షలను రెమ్యునరేషన్ గా అందించారట నిర్మాతలు. అయితే వార్నర్ మాత్రం రెమ్యునరేషన్ విషయంలో ఎలాంటి డిమాండ్ చేయలేదట. సరదా కోసమే ఆ పాత్రను చేస్తానని అంగీకరించాట. కానీ నిర్మాతలే ఆయనకు ఉన్న క్రేజీని దృష్టిలో పెట్టుకొని చిన్న పాత్రలో నటించినా భారీ మొత్తంలో రెమ్యునరేషన్ అందించారట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి ఇంతకీ నితిన్ సినిమాలో డేవిడ్ ఎలాంటి పాత్రలో నటిస్తారు అన్నది తెలియాలి అంటే వేచి చూడాల్సిందే మరి.