HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Cinema
  • >Date And Venue Locked For The Grand Pre Release Event Of Devara

Devara Pre Release Event: దేవ‌ర మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్, ప్లేస్ ఫిక్స్‌..!

ఈనెల 22వ తేదీన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని హైద‌రాబాద్‌లోని నోవాటెల్ హోట‌ల్‌లో నిర్వ‌హించేందుకు చిత్ర‌బృందం ప్లాన్ చేసిన‌ట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీకి సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు ముఖ్య అతిథిగా రాబోతున్న‌ట్లు స‌మాచారం.

  • By Gopichand Published Date - 10:16 PM, Tue - 17 September 24
  • daily-hunt
Devara Pre Release Event
Devara Pre Release Event

Devara Pre Release Event: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా.. డైరెక్ట‌ర్ కొర‌టాల శివ క‌ల‌యిక‌లో వ‌స్తున్న మూవీ దేవ‌ర (Devara Pre Release Event). ఈ మూవీ సెప్టెంబ‌ర్ 27వ తేదీన ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే ఈ మూవీ నుంచి వ‌చ్చిన పాట‌లు, ట్రైల‌ర్ సినీ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. మూవీకి మ‌రింత బ‌జ్ తెచ్చేందుకు చిత్ర బృందం వ‌రుస పెట్టి ప్ర‌మోష‌న్లు చేస్తోంది. సెప్టెంబ‌ర్ 10వ తేదీన ముంబైలో ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్ పెట్టి మూవీ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ ఈవెంట్‌లో జూనియ‌ర్ ఎన్టీఆర్‌, జాన్వీ క‌పూర్‌, కొర‌టాల శివ, సైఫ్ అలీ ఖాన్ పాల్గొన్నారు. అంతేకాకుండా మూవీ గురించి కొన్ని హింట్‌లు కూడా ఇచ్చారు. ఆ త‌ర్వాత స‌న్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి వంగాతో ఓ ఇంట‌ర్వ్యూ వ‌దిలారు. ఇది కూడా సినిమాపై అంచ‌నాల‌ను అమాంతం పెంచేసింది.

తాజాగా చిత్ర‌బృందం త‌మిళ ప్రేక్ష‌కుల్లోకి సినిమా తీసుకుపోవ‌టానికి చెన్నైలో ఓ ఈవెంట్ కండ‌క్ట్ చేస్తున్నారు. అయితే అన్ని లాంగ్వేజెస్‌లో చిత్ర బృందం ఏదో ఒక ర‌కంగా మూవీ ప్ర‌మోష‌న్ చేస్తూనే ఉంది. అయితే తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు మాత్రం దేవ‌ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం వెయ్యి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నారు. తొలుత ఈ మూవీ ఈవెంట్ క‌ర్నూల్‌లో జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ డేట్, ప్లేస్ ఫిక్స్ అయిన‌ట్లు సోష‌ల్ మీడియాలో వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి.

Also Read: Curry Leaves Water: క‌రివేపాకు నీళ్లు తాగితే ఏమ‌వుతుందో తెలుసా..?

కొన్ని కార‌ణాల వల‌న ఏపీలో ఈవెంట్‌కు ఏపీ పోలీసులు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌క‌పోవ‌డంతో మూవీ ఈవెంట్ హైద‌రాబాద్‌కు షిఫ్ట్ అయిన‌ట్లు స‌మాచారం. ఈనెల 22వ తేదీన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని హైద‌రాబాద్‌లోని నోవాటెల్ హోట‌ల్‌లో నిర్వ‌హించేందుకు చిత్ర‌బృందం ప్లాన్ చేసిన‌ట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీకి సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు ముఖ్య అతిథిగా రాబోతున్న‌ట్లు స‌మాచారం. గ‌తంలో కొర‌టాల శివ డైరెక్ష‌న్‌లో మ‌హేశ్ బాబు యాక్ట్ చేసిన భ‌ర‌త్ అనే నేను సినిమాకి తార‌క్ ముఖ్య అతిథిగా వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఆ కృత‌జ్ఞ‌తాభావంతోనే సూప‌ర్ స్టార్ మ‌హేశ్ తారక్ మూవీ ఈవెంట్‌కు రావ‌టానికి ఒప్పుకున్న‌ట్లు ఇండ‌స్ట్రీలో టాక్.

ఎన్టీఆర్ హీరోగా.. జాన్వీ క‌పూర్ క‌థ‌నాయిక‌గా డైరెక్ట‌ర్ కొరటాల శివ దర్శకత్వంలో వ‌స్తున్న‌ ఈ సినిమాని మిక్కిలినేని సుధాకర్ యువసుధా ఆర్ట్స్ బ్యానర్ మీద కళ్యాణ్ రామ్ బావమరిది కొసరాజు హరికృష్ణ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఈనెల 27న పాన్ ఇండియా లెవెల్‌లో విడుద‌ల కానుంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Devara
  • Devara Pre Release Event
  • hyderabad
  • jhanvi kapoor
  • jr ntr
  • Koratala Shiva
  • mahesh babu
  • Novotel
  • pre release event
  • Saif Ali Khan

Related News

Ganesh Nimajjanam Tank Bund

Ganesh Immersion : బై బై గణేశా.. నేడే మహానిమజ్జనం

Ganesh Immersion : హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం భారీగా జరిగే అవకాశం ఉండటంతో, అక్కడ పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. నిమజ్జనం సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే రక్షించడానికి 9 బోట్లు, 200 మంది గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచారు

  • Cbi Director

    CBI : హైదరాబాద్ కు సీబీఐ డైరెక్టర్.. కారణం అదేనా..?

  • Hyderabad

    Hyderabad: గ్రేటర్‌లో నిమజ్జనానికి సర్వం సన్నద్ధం!

  • CM Revanth Reddy offers special prayers to Khairatabad Bada Ganesh

    Hyderabad : ఖైరతాబాద్ బడా గణేశ్‌కి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు

  • Telangana Govt

    Telangana Govt: తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.. 5వేల మంది ఎంపిక‌!

Latest News

  • SIIMA 2025 : సైమా అవార్డ్స్ లో దుమ్ములేపిన పుష్ప 2 ..అవార్డ్స్ మొత్తం కొట్టేసింది

  • Bomb Threat : ఉలిక్కపడ్డ ముంబయి.. ఫ్రెండ్ మీద కోపంతో ఫేక్‌ ఉగ్ర బెదిరింపు మెయిల్‌

  • Production of Eggs : గుడ్ల ఉత్పత్తిలో ఏపీ నం.1

  • Alert : 13న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు!

  • GST 2.0 : GST 2.0తో ప్రభుత్వానికి ఎంత నష్టమంటే?

Trending News

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd