Aparna Das-Deepak Parambol : ‘మంజుమ్మెల్ బాయ్స్’ హీరోతో.. ‘దాదా’ హీరోయిన్ పెళ్లి..
ఈ ఏడాది సినిమా ఇండస్ట్రీలో పెళ్లి సందడిలు కొంచెం ఎక్కువగానే కనిపిస్తున్నాయి. తాజాగా..
- Author : News Desk
Date : 03-04-2024 - 1:02 IST
Published By : Hashtagu Telugu Desk
Aparna Das-Deepak Parambol : ఈ ఏడాది సినిమా ఇండస్ట్రీలో పెళ్లి సందడిలు కొంచెం ఎక్కువగానే కనిపిస్తున్నాయి. వాటిలో కూడా ప్రేమ పెళ్లిళ్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇటీవల రకుల్ ప్రీత్ సింగ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. మొన్నటికి మొన్న సిద్దార్థ్ అండ్ అదితి రావు వారి ప్రేమ జర్నీని పెళ్లిగా మార్చుకుంటూ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఇక తాజాగా దీపక్ పరంబోల్, అపర్ణదాస్ పెళ్లి చేసుకోబోతున్నారు.
ఇటీవల మాయలంలో సూపర్ హిట్ ‘మంజుమ్మెల్ బాయ్స్’ సినిమాలో దీపక్ ఒక హీరోగా నటించారు. ఇక అపర్ణ దాస్ విషయానికి వస్తే.. తమిళ్ చిత్రం ‘దాదా’ సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపుని సంపాదించుకున్నారు. ఆ తరువాత విజయ్ ‘బీస్ట్’, వైష్ణవ్ తేజ్ ‘ఆదికేశవ’ సినిమాలో నటించారు. దీపక్ అండ్ అపర్ణ కలిసి మలయాళ ‘మనోహరం’ సినిమాలో నటించారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి.. అది ప్రేమగా మారినట్లు తెలుస్తుంది.
ఇక ఈ ప్రేమకు ఇరు కుటుంబాల నుంచి అంగీకారం రావడంతో.. ఇప్పుడు ఈ ఇద్దరు ఏడడుగులు వేయడానికి సిద్దమవుతున్నారట. ఏప్రిల్ 24న దీపక్ పరంబోల్, అపర్ణదాస్ పెళ్లి జరగబోతుందట. కేరళలోని వడక్కచేరిలో ఈ వివాహం జరగబోతుందని.. ఓ వెడ్డింగ్ కార్డు కూడా నెట్టింట వైరల్ అవుతుంది. అయితే దీని పై దీపక్ అండ్ అపర్ణ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.
అపర్ణ విషయానికి వస్తే.. టిక్ టాక్ నుంచి హీరోయిన్ గా ఎదిగారు. అపర్ణ దుబాయ్‌లో ఎంబీఏ చేసారు. ఇక ఆ సమయంలో టిక్‌టాక్ వీడియోల చేస్తుండేవారు. వాటికీ మంచి ఫాలోయింగ్ రావడంతో.. అపర్ణ ఫిలిం మేకర్స్ దృష్టిలో పడ్డారు. అలా సినిమా అవకాశాలు అందుకున్నారు. ఇప్పటివరకు ఏడు సినిమాల్లో నటించారు. అలాగే ఓ మ్యూజిక్ ఆల్బంలో కూడా చేసారు.
Also read : Vijay Deverakonda: దళపతి విజయ్ పాలిటిక్స్ పై అలాంటి కామెంట్స్ చేసిన విజయ్ దేవరకొండ.?