Custody Trailer: పోలీస్ ఆఫీసర్ గా అదరగొట్టిన చైతూ, కస్టడీ ట్రైలర్ ఇదిగో!
అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన కస్టడీ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది.
- Author : Balu J
Date : 05-05-2023 - 5:20 IST
Published By : Hashtagu Telugu Desk
టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య (Naga Chaitanya) వైవిధ్యమైన సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. మజిలీ, బంగార్రాజు సినిమాలతో మెప్పించిన చైతూ తాజాగా కస్టడీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీలో ని స్టిల్స్, లుక్స్ భారీ అంచనాలు రేపాయి.
మే 12న రిలీజ్ కి రెడీ అవుతుండడంతో మూవీ టీం ప్రమోషన్స్ సందడి చేస్తున్నారు. తాజాగా ఈ ప్రమోషన్స్ లో భాగంగా ట్రైలర్ (Trailer) ని రిలీజ్ చేశారు. పోలీస్ కస్టడీలో ఉన్న క్రిమినల్ తప్పించిన హీరో అతని కాపాడుకునే ప్రయత్నంలో ఎదురుకున్న సమస్యలే సినిమా కథ అని ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది. ఓ సిన్సీయర్ పోలీస్ ఆఫీసర్, తెలివైన క్రిమినల్ మధ్య సాగే కథలో ఎన్నో మలుపులు ఉంటాయి. ట్రైలర్ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఉంది. నిజం గెలవడం లేట్ అవ్వొచ్చు ఏమో కానీ.. గెలవడం మాత్రం పక్కా అనే డైలాగ్ (Dialogue) ప్రతిఒక్కరినీ ఆకట్టుకుంటోంది. సినిమా ట్రైలర్ చూస్తే పోలీస్ ఆఫీసర్ గా చైతూ అదరగొట్టాడని తెలుస్తుంది. మాస్ట్రో ఇళయరాజా అండ్ యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.
కృతిశెట్టి (Krithi Shetty) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు డైరెక్ట్ చేస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో బై లింగువల్ గా ఈ మూవీ తెరకెక్కుతుంది. పోలీస్ కథాంశంతో వస్తున్న ఈ సినిమాలో చైతన్య నిజాయతి గల పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. అరవింద్ స్వామి (Aravind Swami) విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శరత్ కుమార్, ప్రియమణి, సంపత్ రాజ్, వెన్నల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ ముఖ్యపాత్రలో కనిపించబోతున్నారు.
Also Read: Ugram Movie Review: నరేశ్ ‘ఉగ్రం’ ఎలా ఉందంటే!