HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Movie Reviews
  • >Ugram Movie Review Naresh Makeover From Comedy Role To Serious Action Role

Ugram Movie Review: నరేశ్ ‘ఉగ్రం’ ఎలా ఉందంటే!

  • By Balu J Published Date - 04:13 PM, Fri - 5 May 23
  • daily-hunt
Naresh
Naresh

అల్లరి నరేశ్ (Allari Naresh) అనగానే ఒకప్పుడు కామెడీ చిత్రాలకు కేరాఫ్. కానీ సినిమా అప్ డేట్ అవుతున్న కొద్దీ నరేశ్ కూడా అప్ డేట్ అవుతూ తనలోని నటనను బయటపెడుతున్నాడు. తన రెగ్యులర్ మూవీస్ బదులు వదిలి సీరియస్ సినిమాలు చేస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే నందితో హిట్ కొట్టిన నరేశ్ తాజాగా దర్శకుడు విజయ్ కనకమేడల తెరకెక్కించిన చిత్రం ఇవాళ విడుదల అయింది. సినిమాలా ఉందో తెలుసుకోవాలంటే ఈ రివ్యూను చదువాల్సిందే

స్టోరీ ఏంటంటే

సిఐ శివ కుమార్ (అల్లరి నరేశ్) సీరియస్ అండ్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ (Police Officer). మిస్ అయిన తన భార్య (మిర్నా) మరియు తన కూతురు కోసం సీరియస్ గా వెతుకుతూ ఉంటాడు. అసలు సిఐ శివ కుమార్ భార్య, కూతురు ఎలా మిస్ అయ్యారు ?, అలాగే సిటీలో మిస్ అయిన వందలాదిమంది ప్రజలు ఏమైపోయారు ?, ఈ మిస్సింగ్ కేసులు వెనుక ఎవరు ఉన్నారు ?, చివరకు సిఐ శివ కుమార్ ఈ మిస్సింగ్ కేసులను ఎలా సాల్వ్ చేశాడు ? తన భార్య కూతుర్ని ఎలా సేవ్ చేసుకున్నాడు ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్

సాధారణ ప్రజలు మిస్ అయితే.. పోలీసులు దైర్యాన్ని ఇస్తారు. కానీ, పోలీస్ భార్యపిల్లలే మిస్ అయితే.. ఇక వారి పరిస్థితి ఎలా ఉంటుంది ?, ఒక పోలీస్ ఫ్యామిలీ సమస్యలో ఉంటే.. తనను తన ఫ్యామిలీని అలాగే మిస్ అయిన మిగిలిన ప్రజలను ఆ పోలీస్ ఎలా సేవ్ చేసుకున్నాడు?, ఈ క్రమంలో జరిగిన నాటకీయ పరిణామాలు ఏమిటి? అనే కోణంలో సాగిన ఈ ఉగ్రం సినిమా కొన్ని సీన్స్ లో ఆకట్టుకుంది. తన పరిపక్వతమైన నటనతో అల్లరి నరేశ్ ఈ చిత్రంలోనే ఉత్తమమైన నటనను కనబర్చారు. ముఖ్యంగా క్లిష్టమైన కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో (Action Scenes) ఆయన తన మార్క్ యాక్షన్ తో, నటనతో సినిమాకే హైలెట్ గా నిలిచారు.

అలాగే ప్రధాన పాత్రలో నటించిన శత్రు కూడా చాలా బాగా నటించాడు. ఇక హీరోయిన్ గా నటించిన మిర్నా తన నటనతో ఎమోషనల్ (Emotion) సీన్స్ లో బాగానే నటించింది. మెయిన్ గా హీరో – ఇజ్రాల గెటప్స్ లో ఉన్న విలన్ల మధ్య వచ్చే సన్నివేశాలు పర్వాలేదు. మరో కీలక పాత్రలో నటించిన ఇంద్రజ కూడా బాగానే నటించింది. శ్రీకాంత్ అయ్యంగార్ తో పాటు మిగిలిన నటీనటుల స్క్రీన్ ప్రెజెన్స్ మరియు వారి నటన బాగున్నాయి.

మైనస్ పాయింట్స్

విజయ్ కనకమేడల దర్శకత్వ పనితనం బాగున్నా.. తీసుకున్న స్క్రిప్ట్ లో (Story) విషయం లేకపోవడం సినిమా ఫలితం దెబ్బతింది. అసలు సినిమాలో చెప్పుకోవడానికి గుడ్ పాయింట్ ఉన్నా గానీ, మెయిన్ గా ఏ సీక్వెన్స్ ఇంట్రస్ట్ గా సాగలేదు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో చాలా భాగం మ్యాటర్ లేని సీన్లతో, వర్కౌట్ కాని విచారణ డ్రామాతో సాగితే , సెకెండ్ హాఫ్ సాగతీత సన్నివేశాలతో సాగుతుంది.

సినిమా మొదలైన పది నిముషాలకే ఈ సినిమా ఏ స్థాయి సినిమానే అర్థమయిపోతుంది. దీనికి తోడు అనవసరమైన సీన్స్ తో సినిమాని డైవర్ట్ చేశారు. కథ అవసరానికి మించిన సన్నివేశాలు కూడా ఎక్కువైపోయాయి. అలాగే కథ పరంగా వచ్చే కొన్ని కీలక సీన్స్ కూడా పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు. అయితే సినిమాలో ప్రీ క్లైమాక్స్ లో హై యాక్షన్ సీన్స్ తో మంచి ఎమోషనల్ సీక్వెన్స్ రాసుకోవడం బాగుంది.

నటీనటుల విశ్లేషణ

ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే.. సిద్ధార్థ్ జె సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటింగ్ (Editing) కూడా బాగుంది. ఇక సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకల సమకూర్చిన నేపథ్య సంగీతం బాగుంది. నిర్మాతలు సాహు గారపాటి & హరీష్ పెద్ది ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువులు అద్భుతంగా ఉన్నాయి.

ఎలా ఉందంటే

ఉగ్రం అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామాలో కొన్ని ఎమోషనల్ యాక్షన్ సీన్స్, మరియు క్లైమాక్స్ చాలా బాగున్నాయి. ఐతే, కథనంలో కొన్ని చోట్ల ఆకట్టుకునే కంటెంట్ లేకపోవడం, అలాగే ప్లే బోర్ (Bore) గా సాగడం, కొన్ని సీక్వెన్స్ లో లాజిక్స్ లేకపోవడం వంటి అంశాలు ఈ సినిమాకి మైనస్ గా నిలిచాయి. మొత్తమ్మీద ఈ సినిమా యాక్షన్ డ్రామాలు ఇష్టపడే వారికి బాగా కనెక్ట్ అవుతుంది. కానీ, మిగిలిన వర్గాల ప్రేక్షకులకు పూర్తి స్థాయిలో కనెక్ట్ కాదు.

Also Read: Sreeleela with Chiru: శ్రీలీల జోరు.. చిరు మూవీలో యంగ్ బ్యూటీకి క్రేజీ ఆఫర్!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • allari naresh
  • Movie Review
  • public talk
  • Ugram

Related News

Pradeep Ranganathan Mamitha

Pradeep Ranganathan : డ్యూడ్ మూవీ రివ్యూ.!

ప్రేమని ఇస్తున్నప్పుడు తీసుకోవడం తెలియని వాళ్లు బాధకి అర్హులే. ఆ ప్రేమ లేనప్పుడు.. ప్రేమించిన వాళ్లు దూరం అయ్యినప్పుడు మాత్రమే వాళ్ల విలువ తెలుస్తుంది. కావాలనుకున్నా ఆ ప్రేమ దొరకదు.. వదిలేద్దాం అనుకున్నా ఏదొక రూపంలో వెంటాడుతూనే ఉంటుంది. ఇష్టమైన వాళ్లకి దగ్గర కాలేక.. దూరం అవ్వలేక తనలో తాను పడే సంఘర్షణ, మానసిక వేదన నరకప్రాయమే. అలాంటి నరకం నుంచి విముక్తి పొందడమే అసాధ్యం అన

  • Telusu Kada

    Siddhu Jonnalagadda : తెలుసు కదా రివ్యూ!

Latest News

  • Poisonous Fevers : ఏజెన్సీ గురుకులాలను వణికిస్తున్న విషజ్వరాలు

  • Air China Flight : విమానంలో మంటలు

  • Fatty Liver: ఫ్యాటీ లివర్ సమస్యకు ఈ ఆహారాలతో చెక్ పెట్టండి!

  • Vizag Summit : విశాఖ సమ్మిట్ పెట్టుబడులపైనే అందరి దృష్టి

  • Gold Reserves : బంగారం నిల్వల్లో ఇండియా రికార్డు!

Trending News

    • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

    • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

    • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd