HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Cm Revanth Reaction On Allu Arjun Arrest

Allu Arjun : అల్లు అర్జున్‌కు బెయిల్ రావడం కష్టమేనా..? సీఎం రేవంత్ రియాక్షన్ ఇదే..!!

CM Revanth Reaction : చట్టం తన పని తాను చేసుకుపోతుంది..అరెస్ట్ విషయంలో తన జోక్యం ఏమిలేదని రేవంత్ తెలిపారు. సోషల్ మీడియా లో మాత్రం పలు కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మొన్న పుష్ప 2 సక్సెస్ మీట్ లో సీఎం రేవంత్ పేరు ను అల్లు అర్జున్ మరచిపోయినందుకే ఈరోజు ఆయన్ను అరెస్ట్ చేసి

  • Author : Sudheer Date : 13-12-2024 - 3:05 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Allu Arjun Arrest
Allu Arjun Arrest

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టుతో ఒక్కసారిగా చిత్రసీమే కాదు యావత్ సినీ ప్రేక్షకులు షాక్ లో పడ్డారు. చిక్కడపల్లి పోలీసులు.. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై రెండు సెక్షన్ల కింద అల్లు అర్జున్‌పై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. వీటిలో 118(1) మరియు 105 సెక్షన్ల కింద కేసులు నమోదు కాగా, 105 సెక్షన్ కింద బెయిల్ రావడం కష్టమేనని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

భారత న్యాయ సంహిత చట్టం ప్రకారం, 105 సెక్షన్ కింద నేరం రుజువు అయితే ఐదు నుంచి పదేళ్ల వరకు జైలుశిక్ష పొందే అవకాశం ఉంది. అలాగే 118(1) సెక్షన్ ప్రకారం కూడా నేరం రుజువు అయితే ఏడాది నుంచి పదేళ్ల వరకు శిక్ష పడవచ్చని చట్టం చెబుతుంది. అల్లు అర్జున్ తనను నిర్దోషిగా పేర్కొన్నప్పటికీ, ఈ కేసు విషయంలో పోలీసులు తీవ్రంగా చర్యలు తీసుకుంటున్నారు. అల్లు అర్జున్ పై కేసులు నమోదు కాగానేహైకోర్టును ఆశ్రయించి, తనపై పెట్టిన కేసులను కొట్టివేయాలని పిటిషన్ వేశాడు. సినిమాల విడుదల సమయంలో అనేక మంది నటులు థియేటర్‌కు వెళ్లి సినిమా చూడడం సర్వసాధారణమని పేర్కొంటూ, ఈ ఘటనలో తనపై ఎలాంటి తప్పు లేదని వివరణ ఇచ్చాడు. ఈ సమయంలోనే పోలీసులు అరెస్ట్ చేయడం పై యావత్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ కేసులో సంద్య థియేటర్ యాజమాన్యం కూడా చిక్కుల్లో పడింది. థియేటర్ యజమానిని రేణుకాదేవి, తమపై కేసులు పెట్టడం తప్పు అని హైకోర్టులో సవాల్ చేశారు. థియేటర్‌ను డిస్ట్రిబ్యూటర్లకు అప్పగించి, ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు నిర్వహించడానికి ప్రభుత్వం అనుమతినిచ్చినట్లు తెలిపారు. ఇదిలా ఉంటె అల్లు అర్జున్ అరెస్ట్ పై సీఎం రేవంత్ స్పందించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది..అరెస్ట్ విషయంలో తన జోక్యం ఏమిలేదని రేవంత్ తెలిపారు. సోషల్ మీడియా లో మాత్రం పలు కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మొన్న పుష్ప 2 సక్సెస్ మీట్ లో సీఎం రేవంత్ పేరు ను అల్లు అర్జున్ మరచిపోయినందుకే ఈరోజు ఆయన్ను అరెస్ట్ చేసి ఉంటారని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

Read Also : Swarnandhra Vision 2047: స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • allu arjun
  • Allu Arjun Arrest
  • Allu Arjun Arrest news
  • chiranjeevi
  • cm revanth
  • congress
  • tollywood

Related News

Beautiful actress Bhagyashree Borse finally scores a hit.

Bhagyashri Borse: ఎట్టకేలకు హిట్ కొట్టిన అందాల భామ భాగ్యశ్రీ బోర్సే

సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే గ్లామర్ ఉన్నంత మాత్రాన సరిపోదు.. బాక్సాఫీస్ వద్ద విజయం కూడా వరిస్తేనే ఇక్కడ క్రేజ్ నిలబడుతుంది. బాలీవుడ్ నుంచి వచ్చిన అందాల భామ భాగ్యశ్రీ బోర్సే సైతం తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఇదే సత్యాన్ని ఎదుర్కొంది. రవితేజ సరసన ‘మిస్టర్ బచ్చన్’ లాంటి భారీ పరాజయంతో కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ, ఆ తర్వాత చేసిన సినిమాలు కూ

  • How much is Sreeleela's income? What are her monthly earnings?

    Sreeleela: శ్రీలీల ఆదాయం ఎంత? ఒక నెలకు సంపాదన ఎంతంటే?

  • I will only do such films from now on... Kajal's sensational decision.

    Kajal Aggarwal: ఇకపై అలాంటి సినిమాలే చేస్తా.. కాజల్ సంచలన నిర్ణయం

Latest News

  • Vastu Tips: ఇంట్లో అరటి చెట్టు నాటితే అశుభమా..? శాస్త్రం ఏం చెబుతోంది..!!

  • Cigarette Alert: ఇప్పుడు బాక్స్‌పై కాదు, ప్రతి సిగరెట్‌పై హెచ్చరిక.. ఎక్కడంటే?

  • Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

  • True Love: ఒక వ్యక్తికి మీ మీద నిజంగా ప్రేమ ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు!

  • Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd