Chiyan Vikram : మా ఇద్దరిని కలిపే బాధ్యత ఆయనదే..!
రెండు సినిమాల్లో ఐశ్వర్యని ప్రేమించి ఆమెకు దూరమవుతాడు విక్రం. దీని గురించి లేటెస్ట్ గా ప్రస్తావించారు. విక్రం పా రంజిత్ కాంబోలో వచ్చిన తంగలాన్ సినిమా
- By Ramesh Published Date - 10:50 AM, Sat - 31 August 24

చియాన్ విక్రం ఐశ్వర్య రాయ్ ఈ ఇద్దరి జోడీ బాగుంటుంది. ఇద్దరు కలిసి రావన్, పొన్నియిన్ సెల్వన్ సినిమాల్లో నటించారు. ఈ రెండు సినిమాలు మణిరత్నం డైరెక్షన్ లో వచ్చినవే. ఐతే రెండు సినిమాల్లో ఐశ్వర్యని ప్రేమించి ఆమెకు దూరమవుతాడు విక్రం. దీని గురించి లేటెస్ట్ గా ప్రస్తావించారు. విక్రం పా రంజిత్ కాంబోలో వచ్చిన తంగలాన్ సినిమా హిందీ రిలీజ్ సందర్భంగా ముంబై లో ప్రమోషన్స్ చేస్తున్నారు విక్రం.
ఈ క్రమంలో ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai) తో తన కెమిస్ట్రీ బాగుంటుందని.. ఐతే రావన్, పొన్నియిన్ సెల్వెన్ రెండు సినిమాల్లో మా ప్రేమకథ అర్ధాంతరంగా ముగుస్తుంది. దాని వల్ల మా ఫ్యాన్స్ కాస్త బాధ పడ్డారు. అందుకే మణిరత్నం ని మా ఇద్దరితో ఒక మంచి ముగింపు ఉన్న ప్రేమ కథ చేయమని అడిగానని విక్రం (Vikram) చెప్పారు.
Also Read : Pushpa 2 : సినిమా బాగుంటే అన్ని బాగుంటాయ్..!
ఐశ్వర్య గొప్ప నటి అని.. ఐతే తనకు ఐశ్వర్యతో పాటు అభిషేక్ బచ్చన్ తో కూడా మంచి రిలేషన్ (Relation) ఉందని. అతను నాకు మంచి స్నేహితుడని అన్నారు విక్రం. తంగలాన్ సినిమాతో చాలా కాలం తర్వాత మంచి సక్సెస్ అందుకున్నారు విక్రం. సౌత్ అన్ని భాషల్లో ఆగష్టు 15న రిలీజ్ అయిన తంగలాన్ సినిమా హిందీలో సెప్టెంబర్ 6న రిలీజ్ ప్లాన్ చేశారు.
తమిళతో పాటు తంగలాన్ సినిమాకు తెలుగులో కూడా మంచి టాకే వచ్చింది. ఐతే కమర్షియల్ లెక్కలు ఎలా ఉన్నా విక్రం సినిమాకు ఇలాంటి పాజిటివ్ టాక్రావడం ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంది.