Chiranjeevi – Satyanand : సత్యానంద్ 50 ఏళ్ల సినీ ప్రస్థానం ఫై చిరు ‘ప్రశంసలు ‘
డియర్ సత్యానంద్ గారు.. మీరిలాగే మీ సినీ పరిజ్ఞానాన్ని, సినీ ప్రేమని, అందరికీ పంచుతూ, మరెన్నో చిత్రాల విజయాలకు సంధానకర్తగా, మరో అర్థ శతాబ్దం పాటు ఇంతే ఎనర్జీ తో ఉండాలని ఆశిస్తున్నాను
- By Sudheer Published Date - 03:01 PM, Thu - 5 October 23

చిత్రసీమలో మెగాస్టార్ గా ఉన్నత శిఖరాలను అందుకున్నప్పటికీ చిరంజీవి (Chiranjeevi)..ఎప్పుడు ఆ గర్వం లేకుండా ప్రతి ఒక్కర్ని అభినందిస్తూ..వారి కష్టాన్ని ప్రశంసిస్తుంటారు. తాజాగా రచయిత సత్యానంద్ చిత్రసీమలో అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా సోషల్ మీడియా లో సత్యానంద్ (Satyanand ) ఫై ప్రశంసల జల్లు కురిపించారు.
“ఎన్నెన్నో విజయవంతమైన చిత్రాలకి స్ర్కిప్ట్ సమకూర్చి, పదునైన డైలాగ్స్ రాసి, మరెన్నో చిత్రాలకు స్ర్కిప్ట్ డాక్టర్‌గా ఉంటూ, ఎంతో మంది నేటి రచయితలకు, దర్శకులకు , నటులకు ఒక మెంటోర్ గా, ఒక గైడింగ్ ఫోర్స్‌గా, గొప్ప సపోర్ట్ సిస్టమ్‌గా ఉంటూ, సినిమాని ప్రేమిస్తూ, సినిమానే ఆస్వాదిస్తూ, సినిమాని జీవన విధానం గా మలచుకున్న నిత్య సినీ విద్యార్థి, తరతరాల సినీ ప్రముఖులందరికీ ప్రియ మిత్రులు.. నాకు అత్యంత ఆప్తులు, మృదు భాషి , సౌమ్యులు సత్యానంద్ గారు తన సినీ ప్రస్థానంలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు నా హృదయ పూర్వక ఆత్మీయ శుభాకాంక్షలు.
We’re now on WhatsApp. Click to Join.
ఆయనతో నా వ్యక్తిగత అనుబంధం ఇప్పటిది కాదు. నా అనేక చిత్రాలలో ఆయన వహించిన పాత్ర ఎంతో ప్రగాఢమైనది. డియర్ సత్యానంద్ గారు.. మీరిలాగే మీ సినీ పరిజ్ఞానాన్ని, సినీ ప్రేమని, అందరికీ పంచుతూ, మరెన్నో చిత్రాల విజయాలకు సంధానకర్తగా, మరో అర్థ శతాబ్దం పాటు ఇంతే ఎనర్జీ తో ఉండాలని ఆశిస్తున్నాను’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఇక సత్యానంద్ సినీ ప్రస్థానం విషయానికి వస్తే…ఈయన ప్రఖ్యాత దర్శకులు ఆదుర్తి సుబ్బారావు గారి మేనల్లుడు. రచయితగా పరిచయమైన తొలి చిత్రం మాయదారి మల్లిగాడు. ఆ తర్వాత 400కు పైగా సినిమాలకు పనిచేశారు. ఎన్.టి.రామారావు, ఎ.ఎన్.ఆర్,కృష్ణ, శోభనబాబు, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, పవన్ కళ్యాణ్ కల్యాణ్, మహేష్‌బాబు ఇలా అగ్ర హీరోల చిత్రాలకు ఆయన రచయితగా పనిచేశారు. తన రచనలతో అద్భుత విజయాలు అందించారు. ఈయన మల్లాది వెంకటకృష్ణమూర్తి వ్రాసిన “మిస్టర్ వి” నవల ఆధారంగా తీయబడిన ఝాన్సీ రాణి సినిమాకు దర్శకత్వం వహించాడు. కానీ ఆ సినిమా సక్సెస్ కాలేదు.
Read Also : Vote From Home: ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం
ఎన్నెన్నో విజయవంతమైన చిత్రాలకి
స్క్రిప్ట్ సమకూర్చి, పదునైన డైలాగ్స్ రాసి, మరెన్నో చిత్రాలకు స్క్రిప్ట్ డాక్టర్ గా వుంటూ , ఎంతో మంది నేటి రచయితలకు, దర్శకులకు , నటులకు ఒక మెంటోర్ గా,ఒక గైడింగ్ ఫోర్స్ గా, ఒక గొప్ప సపోర్ట్ సిస్టమ్ గా వుంటూ , సినిమాని ప్రేమిస్తూ , సినిమానే… pic.twitter.com/Tc7aphFOD2— Chiranjeevi Konidela (@KChiruTweets) October 5, 2023