Vishwambhara: మొదలైన చిరంజీవి విశ్వంభర యాక్షన్ సీక్వెన్స్.. ఫైట్ మాస్టర్స్ గా రామ్ లక్ష్మణ్?
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసగా ఒకదాని తర్వాత ఒకటి సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ మేరకు గత ఏడాది వాల్తేర
- By Nakshatra Published Date - 09:00 AM, Wed - 31 January 24
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసగా ఒకదాని తర్వాత ఒకటి సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ మేరకు గత ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకులను ప్రకటించిన చిరంజీవి ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కబోయే విశ్వంభర అనే సినిమాలో నటించబోతున్నారు. సోషియో ఫాంటసీ నేపథ్యంతో తెరకెక్కబోతున్న ఈ సినిమా థ్రిల్లింగ్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో, అబ్బురపరిచే గ్రాఫిక్స్‌తో ఆడియన్స్ కి కన్నులు విందు కానుందట. ఇది ఇలా ఉంటే చిత్ర బృందం ఈ సినిమాకు సంబంధించిన పనులను నెమ్మదిగా మొదలు పెడుతోంది.
అందులో భాగంగానే పక్క ప్రీ ప్రొడక్షన్ వర్క్ తో ముందుకు సాగుతోంది. ఆర్ట్ వర్క్ నుంచి యాక్షన్ పార్ట్ వరకు అంతా ముందుగానే డిజైన్ చేసుకొని సెట్స్ పైకి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే మూవీలో దాదాపు 13 సెట్స్ కి సంబంధించిన ప్రీ డిజైన్ సెక్షన్స్ జరిగాయట. కాగా తాజాగా యాక్షన్ పార్ట్ ని డిజైన్ చేసేందుకు ఫైట్ మాస్టర్స్ తో దర్శకుడు వశిష్ఠ, సినిమాటోగ్రాఫర్ చోట కె నాయుడు పాల్గొని చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకి యాక్షన్ పార్ట్ డిజైన్ చేయబోతున్నారు ఫైట్ మాస్టర్స్ యాక్షన్ డియో రామ్ లక్ష్మణ్. ఈ మేరకు ఈ అప్డేట్ ని ఇస్తూ మూవీ టీం ఒక ఫొటోతో ట్వీట్ చేసింది. ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా పూర్తి అయ్యిపోయాయి.
ఎం ఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. అయితే ఈ మూవీలో చిరంజీవితో పాటు నటించబోయే ఇతర నటీనటులు ఎవరు అన్నది మాత్రం క్లారిటీ రాలేదు. ఈ సినిమాలో రానా దగ్గుబాటి విలన్ గా నటించబోతున్నారని, అలాగే త్రిష ఫిమేల్ లీడ్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇకపోతే ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మూవీ మేకర్స్. ఫిబ్రవరి మొదటివారం నుంచి చిరంజీవి ఈ సినిమా షూటింగ్స్ లో పాల్గొన్న పోతున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
Related News
RGV : ఫస్ట్ టైమ్ తెలుగు దర్శకులతో ఆర్జీవి..!
RGV నిన్న మొన్నటిదాకా పొలిటికల్ ఎజెండాతో కొన్ని సినిమాలు చేసి సందడి చేసిన సంచలన దర్శకుడు ఆర్జీవి ఏపీలో ఎలక్షన్స్ అయిపోయాయి కాబట్టి తను కూడా ఇప్పుడు ఒక దర్శకుడిని