HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Chiranjeevi Said Not Only Flowers But Eggs Were Also Thrown At Me

Chiranjeevi Reveals: పూలు మాత్రమే కాదు.. నాపై గుడ్లు కూడా విసిరారు: చిరంజీవి

సోనీ లివ్ తాజాగా ఒక ప్రోమో విడుదల చేసింది. ఆ ప్రోమోలో ప్రశంసలే కాదు.. విమర్శలు సైతం ఎదుర్కొన్నట్లు చెప్పారు.

  • Author : Balu J Date : 08-02-2023 - 3:48 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Smitha Show
Smitha Show

టాలీవుడ్ (Tollywood)లో అందరివాడిగా పేరు తెచ్చుకున్న చిరంజీవి (Chiranjeevi) తన సినిమాలతో వినోదం పంచడమే కాదు.. సేవా కార్యక్రమాలు చేయడంలో కూడా ముందుంటారు. 2008 వరకు ఆయన ఇమేజ్ ఆకాశమంత ఎత్తులో ఉండేది. అయితే ఆ తర్వాత ఆయన ప్రజారాజ్యం పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి రావడం, ఆ తర్వాత మారిన పరిస్థితుల దృష్ట్యా తన పార్టీని కాంగ్రెస్‌ (Congress) లో విలీనం చేయడం వల్ల ఎప్పుడూ లేని విధంగా చిరంజీవి (Chiranjeevi) నెగిటివిటీ ఎదుర్కొన్నారు.

అయితే ఆ గడ్డుకాలం కొద్ది రోజులే. చిరంజీవి రాజకీయాలకు గుడ్ బై చెప్పి మళ్లీ సినిమాల్లో బిజీ అయిన తర్వాత ప్రేక్షకులు ఆయన్ను మళ్లీ అక్కున చేర్చుకున్నారు. అయితే మెగాస్టార్‌ (Megastar)గా ఎంతో కీర్తి ప్రతిష్టలు తెచ్చుకున్న చిరంజీవి ప్రశంసలే కాదు .. విమర్శలు సైతం ఎదుర్కొన్నారు. ఆ విషయాలను స్వయంగా చిరంజీవే వెల్లడించారు. సోనీ లివ్ ఓటీటీ వేదికగా పాప్ సింగర్ స్మిత హోస్ట్ గా ‘నిజం విత్ స్మిత’ అనే షో ఈనెల 10వ తేదీన ప్రారంభం కానుంది. అయితే ఈ షో ఫస్ట్ గెస్ట్‌గా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించి సోనీ లివ్ (Sony Live) తాజాగా ఒక ప్రోమో విడుదల చేసింది. ఆ ప్రోమోలో చిరంజీవి స్మితతో మాట్లాడుతూ తన జీవితంలో ప్రశంసలే కాదు.. విమర్శలు సైతం ఎదుర్కొన్నట్లు చెప్పారు.

గతంలో ఒకసారి జగిత్యాలకు వెళ్ళగా అభిమానులు (Fans) పూల వర్షం కురిపించారని.. అయితే అదే సమయంలో మరి కొంతమంది తనపై కోడిగుడ్లు (Eggs) విసిరినట్లు చిరంజీవి తెలిపారు. అయితే ఈ విషయం గురించి చిరంజీవి గతంలో ఎప్పుడూ ఓపెన్ అయ్యింది లేదు. ఇన్నేళ్ల తర్వాత నిజాలు మాత్రమే మాట్లాడాలని నిబంధనలు పెట్టిన నిజం విత్ స్మిత షోలో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి చిరంజీవి (Chiranjeevi) చెప్పారు. అంతేకాదు తన దశాబ్దాల కెరీర్లో హీరోగా ఎదుగుతున్న క్రమంలో ఎదురైన అవమానాలు, అనుమానాల గురించి చిరంజీవి వివరించారు. తన వ్యక్తిగత విషయాల గురించి, సినీ ఇండస్ట్రీ గురించి పలు విషయాలను ఈ షోలో ఆయన వెల్లడించారు. ఈ షో కోసం మెగాస్టార్ అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

Also Read: 10 years of Mirchi: ప్రభాస్ ‘మిర్చి’కి పదేళ్లు.. బ్లాక్ బస్టర్ మూవీ తయారైంది ఇలా!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chiranjeevi
  • eggs
  • Nijam with smitha talk show
  • telangana

Related News

Heavy Rain Forecast for Telangana

తెలంగాణను తాకిన నైరుతి రుతుపవనాలు

తెలంగాణ రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. సోమవారం (జూన్ 8) ఇవి దక్షిణ సరిహద్దు జిల్లా అయిన జోగులాంబ గద్వాల జిల్లాను తాకాయి. రానున్న రెండు రోజుల్లో ఇవి రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీనికి తోడు ఉత్తరప్రదేశ్ నుండి కోస్తాంధ్ర వరకు కొనసాగుతున్న ద్రోణి కారణంగా మంగళవారం పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవ

  • Does eating boiled eggs prevent heart problems?

    Eggs Benefits: ఉడికించిన కోడిగుడ్లు తింటే గుండె సమస్యలు రావా..?

  • KTR Delivers Strong Counter to Pawan's Remarks

    KTR: పవన్‌ వ్యాఖ్యలపై కేటీఆర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

  • Janasena Pawan Kalyan

    JANASENA : ప‌వ‌న్ పై జ‌డ్చ‌ర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఫైర్‌.. ప్యాకేజీ ఇస్తే..?

  • Janasena will contest in Telangana.

    Pawan Kalyan: తెలంగాణలో పోటీ చేస్తాం పవన్ కళ్యాణ్

Latest News

  • Private Colleges: ఏపీలో ప్రైవేట్ కాలేజీలకు భారీ ఊరట

  • LPG Cylinder Subsidy: సబ్సిడీతో ఇక ఏడాదికి 4 సిలిండర్లే!

  • Arjun Tendulkar: కొడుకు అర్జున్‌ ప్రదర్శనపై సచిన్‌ ప్రశంసల జల్లు

  • H1B visa: వీసాలపై అమెరికా ఉక్కుపాదం.. హెచ్‌-1బీ వీసా ఫీజు పెంపు

  • చంద్రబాబును కలిసిన పెద్దాయన సత్యనారాయణ

Trending News

    • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd