Chiranjeevi : బాలయ్య సినిమా కోసం రంగంలోకి చిరంజీవి
Chiranjeevi : "ఈ సినిమా తెలుగువారందరికీ గర్వకారణం, అందరూ చూసి ఆనందించండి" అంటూ చిరంజీవి ఇచ్చిన పిలుపు
- By Sudheer Published Date - 11:57 AM, Fri - 28 March 25

తెలుగు సినీ ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని అందించిన సినిమాల్లో ‘ఆదిత్య 369’ (‘Aditya 369’) ఒకటి. బాలకృష్ణ (balakrishna) ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా 1991లో విడుదలై సంచలన విజయం సాధించింది. దేశంలోనే మొదటి సోషియో ఫాంటసీ హిస్టారికల్ సైన్స్ ఫిక్షన్ మూవీగా గుర్తింపు పొందిన ఈ చిత్రానికి సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. శ్రీకృష్ణదేవరాయలుగా బాలకృష్ణ నటనకు ప్రేక్షకుల నుంచి విశేషమైన ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు దాదాపు 34 ఏళ్ల తర్వాత ఈ సినిమాను మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 4న రీ-రిసీల్ చేయనున్నట్లు నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ ప్రకటించడంతో బాలయ్య అభిమానులు భారీగా వేడుకలు నిర్వహిస్తున్నారు.
MAD Square : మ్యాడ్ స్క్వేర్ టాక్
‘ఆదిత్య 369’ సినిమా విడుదల సందర్భంగా సినిమాపై మరింత ప్రజాదరణ పొందడానికి మెగాస్టార్ చిరంజీవి (Chirajeevi) తన మద్దతు ప్రకటించడం విశేషం. అప్పట్లో బాలయ్య, చిరంజీవిలు ఇండస్ట్రీలో పోటీదారులే అయినా, మంచి కంటెంట్ ఉన్న సినిమా తెలుగు ప్రేక్షకులందరికీ చేరాలని చిరు భావించారు. అందుకే “ఈ సినిమా తెలుగువారందరికీ గర్వకారణం, అందరూ చూసి ఆనందించండి” అంటూ చిరంజీవి ఇచ్చిన పిలుపు భారీగా ప్రభావం చూపింది. చిరు వ్యాఖ్యలతో ఈ సినిమా కలెక్షన్లు మరింత పెరిగాయి. ఇండస్ట్రీలో పోటీ ఉన్నా వ్యక్తిగతంగా ఉన్న వారి స్నేహబంధం అభిమానులకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.
BCCI: టీమిండియా స్టార్ ఆల్ రౌండర్‌కు బీసీసీఐ బంపరాఫర్.. గ్రేడ్ బీ నుంచి గ్రేడ్ ఏకు ప్రమోషన్!
ప్రస్తుత తరం ప్రేక్షకులకు ఈ అద్భుత చిత్రాన్ని తగిన సాంకేతిక మెరుగులతో అందించేందుకు చిత్రబృందం ప్రత్యేక చర్యలు తీసుకుంది. గ్రాఫిక్స్, సౌండ్ ఎఫెక్ట్స్‌ను ఆధునికీకరించి, ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించేలా మార్పులు చేశారు. మరి సినిమా ఏ రేంజ్ లో ఆడుతుందో చూద్దాం.