Family Star: ఫ్యామిలీ స్టార్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్ గా చిరంజీవి.. ఇందులో నిజమెంత?
- By Sailaja Reddy Published Date - 06:03 PM, Sun - 31 March 24
రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కలిసి నటించిన తాజా చిత్రం ఫ్యామిలీ స్టార్. దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. అయితే గతంలో విజయ్ దేవరకొండ అలాగే పరుశురాం కాంబినేషన్లో వచ్చిన గీతాగోవిందం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాటు హీరోకి విజయ్ భారీగా గుర్తింపుని తెచ్చి పెట్టింది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ బ్లాక్ బాస్టర్ హిట్ అవడంతో ఇప్పుడు మరోసారి ఈ సినిమాపై భారీగా అంచనాలను నెలకొన్నాయి.
ఇకపోతే తాజాగా రూపొందిన ఫ్యామిలీ స్టార్ సినిమా వచ్చే నెల అనగా ఏప్రిల్ 5న విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే విడుదల తేదీకి మరో కొద్ది రోజులు మాత్రమే సమయం ఉండడంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్ ని వేగవంతం చేశారు. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఏప్రిల్ 2న ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించబోతున్నారట. ఇక ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారని సమాచారం. కాగా గతంలో గీతగోవిందం సక్సెస్ మీట్ కి చిరంజీవి హాజరయ్యి విజయ్ ని అభినందించారు.
ఇప్పుడు మూవీ రిలీజ్ కి ముందే వచ్చి విజయ్ ని అభినందించడం కోసం రాబోతున్నారట. మరి ఈ వార్తలో నిజానిజాలు తెలియాలి అంటే వేచి చూడాల్సిందే మరి. కాగా ఈ సినిమా తెలుగు, తమిళంలో రిలీజ్ చేస్తున్నారు. రెండు వారాల తరువాత హిందీతో పాటు ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. కాగా ఈ మూవీ థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ 45 కోట్ల వరకు జరుగుతున్నట్లు సమాచారం. గీతగోవిందంతో 100 కోట్ల కలెక్షన్స్ ని అందుకోవడంతోనే ప్రస్తుతం విజయ్ ప్లాప్స్ లో ఉన్న ఇంతటి బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.
Related News
Vanga Geetha : చిరు అభిమానినే.. వంగ గీత మాటల వెనుక రహస్యం ఏంటో..?
ఈ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసినందున అందరి దృష్టిని ఆకర్షించిన నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి.