HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Chiranjeevi Anil Ravipudi Mega157 Kerala Schedule Update

Vishwambhara : డైరెక్టర్ అనిల్ రావిపూడి వరుసగా అప్డేట్స్ ఇస్తున్నారుగా

Vishwambhara : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ భారీ చిత్రాన్ని చేస్తున్నారు. ఈ సినిమాపై మొదటి నుంచీ ఫ్యాన్స్‌కి భారీ అంచనాలే ఉన్నాయి.

  • Author : Kavya Krishna Date : 23-07-2025 - 7:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chiranjeevi, Anil Ravipudi
Chiranjeevi, Anil Ravipudi

Vishwambhara : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ భారీ చిత్రాన్ని చేస్తున్నారు. ఈ సినిమాపై మొదటి నుంచీ ఫ్యాన్స్‌కి భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్ట్, తాజాగా కేరళలోని అందమైన లొకేషన్స్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించింది. కేరళ షెడ్యూల్ విజయవంతంగా ముగిసిన విషయాన్ని స్వయంగా దర్శకుడు అనిల్ రావిపూడి సోషల్ మీడియాలో పంచుకున్నారు.

అనిల్ రావిపూడి తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో “మన శంకరవరప్రసాద్ గారు కేరళలో ముచ్చటగా మూడో షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని హైదరాబాదుకు వచ్చారు” అంటూ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో చిరంజీవి, అనిల్ రావిపూడి , చిత్ర యూనిట్ చార్టర్డ్ ప్లేన్‌లో కేరళ నుంచి బయల్దేరడం, తరువాత హైదరాబాదులో ల్యాండ్ అవడం కనిపిస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ ప్రాజెక్ట్‌కు ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. ప్రస్తుతానికి ‘మెగా 157’ అనే వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ జరుపుతున్నారు. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా అందాల తార నయనతార నటిస్తోంది. ఇద్దరి కాంబినేషన్ మళ్లీ స్క్రీన్‌పై మెరిసే అవకాశం రావడంతో ప్రేక్షకులలో ఉత్సాహం పెరిగింది.

మెగా ఫ్యాన్స్‌ను మరింత ఎగ్జైట్ చేస్తున్న మరో విషయం ఏంటంటే, చిరంజీవి తనయ సుష్మిత ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తుండటం. సాహు గారపాటి కూడా ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మాణ బాధ్యతలు పంచుకుంటున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా, టెక్నికల్ టీమ్ ఈ సినిమాను విజువల్ గ్రాండియర్‌గా తీర్చిదిద్దడానికి కసరత్తు చేస్తోంది.

ఈ సినిమా మాస్ , ఫ్యామిలీ ఆడియెన్స్‌కి కనెక్ట్ అయ్యే విధంగా, యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్ మేళవింపుతో తెరకెక్కుతున్నట్లు సమాచారం. చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న ఈ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ వద్ద భారీ హిట్టు అవుతుందన్న నమ్మకంతో అభిమానులు ఎదురుచూస్తున్నారు.

CM Revanth Reddy : కులగణనలో తెలంగాణ మోడల్‌కు రోల్ మోడల్ హోదా


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • anil ravipudi
  • Bheems Ceciroleo
  • chiranjeevi
  • Kerala Schedule
  • Mega Star Movie Update
  • Mega157
  • Nayanthara
  • Sushmita konidela
  • Telugu Cinema
  • Tollywood Movies

Related News

Chiranjeevi Creates a Buzz on the Peddi Sets

Ram Charan పెద్ది సెట్స్ లో చిరంజీవి సందడి

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, యువ దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా సెట్స్‌పై తాజాగా మెగాస్టార్ చిరంజీవి సందడి చేశారు. ఈ విషయాన్ని దర్శకుడు బుచ్చిబాబు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. చిరంజీవి సెట్‌ను సందర్శించినప్పటి వీడియోను ఆయన షేర్ చేశారు. The BOSS and my GURU on sets of #Peddi… It’s one of the best […

  • Celebrities Congratulations To Vijay On TVK

    Thalapathy Vijay: దళపతి విజయ్‌కు సెలబ్రిటీల స్పెషల్ విషెస్!

Latest News

  • Amazon Great Summer Sale : హై-ఎండ్ హెడ్‌ఫోన్లపై డిస్కౌంట్లు

  • Amazon : కిరాణా సామాగ్రిపై 50% ఆఫ్.. అమెజాన్ సమ్మర్ సేల్ 2026 టాప్ డీల్స్ ఇవే!

  • CM Vijay: సీఎంకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

  • Weight Loss: సడెన్‌గా బరువు తగ్గారా..?

  • CM Joseph Vijay: మీ విజయ్‌ మామ అండగా ఉంటాడు : సీఎం విజయ్‌

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd